Mon Dec 23 2024 03:32:25 GMT+0000 (Coordinated Universal Time)
ధమాకా.. మూడు రోజుల వసూళ్లు, రవితేజకు ధమాకా హిట్
గతేడాది డిసెంబర్ లో విడుదలైన అఖండ సంక్రాంతి వరకూ తిరుగులేకుండా థియేటర్లలో ఆడి.. భారీ వసూళ్లు రాబట్టింది.
రవితేజ - శ్రీలీల జోడీగా.. "నేను లోకల్" డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ధమాకా. ఈనెల 23న విడుదలైన ఈ సినిమా..తొలి షో లో మిక్స్ డ్ టాక్ వచ్చినా.. ఆ తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ తో ముందుకెళ్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాలో రవితేజ డిఫరెంట్ లుక్స్ లో కనిపించి.. మాస్ ఆడియన్స్ ను ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. మాస్, ఫన్, కామెడీ, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. చూడబోతే రవితేజ కెరీర్లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి.. క్రాక్ ను మించిన వసూళ్లు రాబట్టేలా కనిపిస్తోంది. ఎందుకంటే.. సంక్రాంతి వరకూ మరో పెద్దహీరో సినిమా లేదు.
గతేడాది డిసెంబర్ లో విడుదలైన అఖండ సంక్రాంతి వరకూ తిరుగులేకుండా థియేటర్లలో ఆడి.. భారీ వసూళ్లు రాబట్టింది. సక్సెస్ ఫుల్ గా 50 రోజులకు పైగా థియేటర్లలో తిరుగులేకుండా రన్ అయింది. ఇప్పుడు రవితేజ కూడా అలాంటి టైమ్ లోనే వచ్చి భారీ వసూళ్లు రాబడుతున్నాడు. భారీ ఓపెనింగ్స్ తో మొదలైన ధమాకా.. తొలి మూడ్రోజుల్లో రూ.32 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ రూ.13.37 కోట్ల షేర్, రూ.22.8 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ధమాకా.
3వ రోజున.. నైజాంలో 2.28 కోట్లు, సీడెడ్లో 91 లక్షలు, ఉత్తరాంధ్రలో 68 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 29 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 20 లక్షలు, గుంటూరు జిల్లాలో 31 లక్షలు, కృష్ణా జిల్లాలో 34 లక్షలు, నెల్లూరు జిల్లాలో 17 లక్షలు వసూలు చేసింది. మూడ్రోజుల వసూళ్లను చూస్తే.. మూడు రోజులు ధమాకా కలెక్షన్లు ధమాకా మూవీకి సంబంధించి ప్రాంతాల వారీగా గత మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో ఈ సినిమా 6 కోట్లు, సీడెడ్లో 2.25 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.68 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 73 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 60 లక్షలు, గుంటూరు జిల్లాలో 90 లక్షలు, కృష్ణా జిల్లాలో 79 లక్షలు, నెల్లూరు జిల్లాలో 42 లక్షల రూపాయాలు సాధించింది.
ఓవర్సీస్ బాక్సాఫీస్ విషయానికొస్తే.. అమెరికాలో మూడ్రోజుల్లో 200k డాలర్లను వసూలు చేసింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.1.10 కోట్లు వసూలు చేసింది. ఇలా మొత్తంగా రూ.32 కోట్లు వసూళ్లు చేసిన ధమాకా..రూ.18.5 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. లాభాల బాట పట్టాలంటే.. ఇంకా కోటి రూపాయలు వసూలు చేయాలి. గతేడాది వచ్చిన క్రాక్ మొత్తంగా రూ.60-70 కోట్లు వసూలు చేయగా.. ధమాకా క్రాక్ ను దాటుతుందన్న అంచనాలున్నాయి.
Next Story