Mon Dec 23 2024 03:41:57 GMT+0000 (Coordinated Universal Time)
Dhamaka Trailer : ధమాకా ట్రైలర్.. మాస్ ఆడియన్స్ కి డబుల్ "ధమాకా"
‘‘మనకు కావాల్సిన వాళ్లకి చేస్తే మోసం.. మనకి కావాలి అనుకున్న వాళ్లకి చేస్తే న్యాయం’’ డైలాగ్‌కు రవితేజ ..
మాస్ ఆడియన్స్, మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న ధమాకా ట్రైలర్ వచ్చేసింది. డిసెంబర్ 23న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ చూస్తుంటే.. డబుల్ ధమాకా మాస్ ఎంటర్టైనర్ కన్మర్ఫ్ అనిపిస్తుంది. దర్శకుడు నక్కిన త్రినాథరావు ఈ సినిమాపై ఎందుకంత ధీమాగా ఉన్నాడో ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. రవితేజకు ఉన్న మాస్ ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా.. ట్రైలర్ ను కట్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఒక బిజినెస్ మెన్ కొడుకు స్థానంలోకి వచ్చిన మరో రవితేజ ఆ ప్రాబ్లమ్స్ ను ఎలా సాల్వ్ చేశాడన్నది సినిమా కథగా ఉంటుంది. జయరాం చెప్పే ''మనకు కావాల్సిన వాళ్లకి చేస్తే మోసం.. మనకి కావాలి అనుకున్న వాళ్లకి చేస్తే న్యాయం'' డైలాగ్‌కు రవితేజ ''త్రివిక్రమ్ మీకు చుట్టమా సార్'' అంటూ వేసిన కౌంటర్ పేలింది. ఈ డైలాగ్ కు థియేటర్లో విజిల్స్ ఖాయం. ఇక ఈ సినిమాలో యాక్షన్‌కు ఏమాత్రం కొదవ లేదని ట్రైలర్లోనే చూపించేశారు. చివరగా రవితేజ చెప్పిన ''నేను వెనక ఎవరూ లేకపోయినా ముందుకు రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసినవాడిని'' అనే డైలాగ్ ఈ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది. నిజానికి రవితేజ నిజజీవతంలోనూ ఈ డైలాగ్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. వెనుక ఎవరూ లేకపోయినా.. సింగిల్ వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. ట్రైలర్ మొత్తంగా చూస్తే.. రవితేజ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద 'ధమాకా' వసూళ్లు ఖాయమంటున్నారు సినీప్రియులు. శ్రీలీల రవితేజకు జోడీగా నటించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణసంస్థ చిత్రాన్ని నిర్మించింది.
Next Story