Tue Dec 24 2024 02:47:47 GMT+0000 (Coordinated Universal Time)
విడాకుల తర్వాత తొలిసారి కలిసిన ఐశ్వర్య-ధనుష్.. ఫొటోలు వైరల్
విడాకుల తర్వాత ఐశ్వర్య - ధనుష్ విరివిగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. కాగా.. విడాకులు తీసుకున్నాక తొలిసారి ఐశ్వర్య-ధనుష్
తమిళ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఇటీవలే విడాకులు తీసుకుని తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. విడాకుల సమయంలో రజనీకాంత్ అల్లుడు - కూతురిని కలిపేందుకు ఎంత ప్రయత్నించినా అది ఫలించలేదు. విడాకుల తర్వాత ఐశ్వర్య - ధనుష్ విరివిగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. కాగా.. విడాకులు తీసుకున్నాక తొలిసారి ఐశ్వర్య-ధనుష్ కలుసుకున్నారు.
ధనుష్ - ఐశ్వర్య లకు ఇద్దరు కొడుకులున్నారు. పెద్దకొడుకు యాత్ర, చిన్నకొడుకు లింగా. తాజాగా యాత్రకు సంబంధించిన కార్యక్రమం కోసం వీరిద్దరూ అతని స్కూల్ కు వెళ్లారు. పెద్ద కొడుకు యాత్ర స్పోర్ట్స్ కెప్టెన్ అవడంతో... వీరిద్దరూ దగ్గరుండి ఆ ఈవెంట్ ను వీక్షించారు. పిల్లల కోసం కలిసిన వీరిద్దరూ అక్కడ ఇద్దరు కొడుకులతో కలిసి ఫొటోలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు, రజనీ, ధనుష్ అభిమానులు వీరిద్దరూ మళ్లీ కలిస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు.
Next Story