Mon Dec 23 2024 06:06:24 GMT+0000 (Coordinated Universal Time)
తమిళ హీరో ధనుష్ అన్న విలన్గా.. రవితేజ కొత్త సినిమా..!
రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని.. మరోసారి కలిసి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తమిళ హీరో ధనుష్ అన్న..
మాస్ మహారాజ్ రవితేజ ఈ దసరాకి 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. థియేటర్స్ లో ఈ సినిమా సక్సెస్ ఫుల్గా రన్ అవుతున్న సమయంలోనే తన కొత్త చిత్రాన్ని లాంచ్ చేసేశాడు. హ్యాట్రిక్ హిట్టు కొట్టి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనిపించుకున్న రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని.. మరోసారి కలిసి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రకటించిన ఈ చిత్రం నేడు లాంచ్ అయ్యింది.
పూజా కార్యక్రమాలతో మూవీని ఘనంగా లాంచ్ చేశారు. త్వరలోనే షూటింగ్ ని కూడా మొదలు పెట్టబోతున్నారు. ఇక ఈ మూవీ కోసం పని చేసే టెక్నీషియన్స్, నటీనటుల వివరాలను కూడా మేకర్స్ తెలియజేశారు. ఈ సినిమాలో తమిళ హీరో ధనుష్ అన్నయ్య మరియు దర్శకుడు అయిన సెల్వరాఘవన్ కూడా నటిస్తున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. అయితే అతనిది ఎటువంటి పాత్ర అనేది తెలియజేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం.. సెల్వరాఘవన్ విలన్ గా కనిపించబోతున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అలాగే కోలీవుడ్ యాక్ట్రెస్ ఇందుజా రవిచంద్రన్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేస్తుంది. ఇక రవితేజకి జోడిగా కృతిశెట్టిని తీసుకునే ప్రయత్నంలో మూవీ టీం ఉన్నట్లు సమాచారం. థమన్ ఈ మూవీకి సంగీతం అందించబోతున్నాడు. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన క్రాక్, బలుపు సినిమాలకు కూడా థమనే సంగీతం అందించాడు. మరి డాన్ శీను నుంచి కంటిన్యూ చేస్తున్న హిట్ పరంపరని రవితేజ, గోపీచంద్.. నాలుగో సినిమాతో హిట్టు కొట్టి కూడా ముందుకు తీసుకు వెళ్తారా లేదా చూడాలి.
గత మూడు సినిమాలు మాదిరిగానే దర్శకుడు గోపీచంద్.. ఈ చిత్రాన్ని కూడా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. ఇక ఈ కాంబో కోసం ఎదురు చూస్తున్న రవితేజ అభిమానులు.. ఎప్పుడెప్పుడు మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ కాంబినేషన్ పై ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ లో కూడా మంచి క్రేజ్ ఉండడంతో నిర్మాతలు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నట్లు తెలియజేశారు.
Next Story