Fri Nov 22 2024 19:43:56 GMT+0000 (Coordinated Universal Time)
SIR REVIEW : సార్ రివ్యూ.. తెలుగులో ధనుష్ హిట్ కొట్టాడా ?
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై సినిమాను
ధనుష్, సంయుక్త జంటగా.. సాయికుమార్, సముద్రఖని, సుమంత్ కీలక పాత్రల్లో డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సార్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై సినిమాను నిర్మించారు. తమిళ హీరో అయిన ధనుష్.. తొలిసారిగా పూర్తిగా తెలుగు సినిమా చేశాడు. తెలుగులో సార్, తమిళంలో వాతిగా వచ్చిన ఈ సినిమాను బెలింగువల్ గా తీశారు. మాస్టారు మాస్టారు పాటతో.. ఈ సినిమాకు క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత ట్రైలర్, వరుస ప్రమోషన్ మీట్స్ తో సార్ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ రోజు (ఫిబ్రవరి 17) ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో సార్ సినిమా విడుదలైంది. ప్రీమియర్ షో ల నుంచే సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది.
కథ
ఇంటర్ చదివే కుర్రాడికి వాళ్ళ తాత వీడియో షాప్ ఖాళీ చేస్తుంటే ఎంసెట్ కోచింగ్ కి సంబంధించిన కొన్ని వీడియో క్యాసిట్స్ కనిపిస్తాయి. వీళ్ల కాలేజీలో కంటే.. అక్కడ చదువు బాగా చెప్తున్నారని గ్రహించి.. ఆ క్యాసిట్స్ లో కోచింగ్ చెప్పింది ఎవరు అని దాంట్లో ఉన్న స్లిప్ ఆధారంగా వెతుక్కుంటూ వెళ్తారు. అలా ఓ జిల్లా కలెక్టర్ (హీరో సుమంత్) దగ్గరికి వెళ్తారు. మా బాలు సార్ అని 1999లో జరిగిన కథ చెప్పడం మొదలుపెడతాడు కలెక్టర్. ధనుష్.. బాలగంగాధర్ తిలక్ గా ఒక మాస్టారు పాత్రలో కనిపిస్తాడు. అతనితో పనిచేసే టీచర్ గా మీనాక్షి (సంయుక్త మీనన్) ఉంటుంది. 1999 లో అప్పుడప్పుడే విద్య ప్రైవేట్ రంగం చేతుల్లోకి వెళ్లి ఇంటర్, ఇంజనీరింగ్ కాలేజీలు, ఎంసెట్ కోచింగ్ సెంటర్లు వస్తున్నాయి, దానివల్ల ప్రభుత్వ కాలేజీలకు ఎవరు వెళ్ళకపోవడం, టీచర్లు కూడా ఎక్కువ జీతాలకు ఆశపడి ప్రైవేట్ కాలేజీలకు వెళ్తారు. దాంతో త్రిపాఠి సంస్థల అధినేత ప్రభుత్వ విద్యాసంస్థలను నిలబెట్టేందుకు కృషి చేస్తాడు. అలా సిరిపురం గవర్నమెంట్ కాలేజీకి బాలగంగాధర్ తిలక్ వస్తాడు. కానీ.. ఊరి ప్రెసిడెంట్ (సాయి కుమార్) అతడిని ఊరి నుంచి గెంటేస్తాడు. అసలేం జరిగింది ? ప్రెసిడెంట్ కి బాలు కి మధ్య ఉన్న గొడవలేంటి ? ఆఖరికి ఏం జరిగింది తెలియాలంటే.. తెరపై సినిమా చూడాల్సిందే..
ఎలా ఉందంటే..
1990-2000 దశకంలో సాగుతూ వచ్చే సినిమానే అయినా.. ప్రస్తుతం విద్య విషయంలో ఉన్న పరిస్థితులకి దగ్గరగా ఉండే కథ. విద్య అనేది గుడిలో ప్రసాదం వంటిది. అందరికీ సమానంగా పంచాలి. అంతేకాని ఫైవ్ స్టార్ హోటల్ లో ఉండే వంటకంలా అమ్మకూడదని చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు వెంకీ అట్లూరి. సినిమాలో భావోద్వేగాలు ప్రధానంగా కనిపిస్తాయి. సహజత్వానికి దూరంగా ఉండే సీన్లతో.. కథ ఎక్కడో కృత్రిమంగా ఉన్నట్టు అనిపిస్తుంది. హైపర్ ఆది జోకులు, హీరో-హీరోయిన్ మధ్య ప్రేమ ఆకట్టుకుంటాయి. ద్వితీయార్థంలో సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి.
ప్లస్ పాయింట్స్
+విద్య నేపథ్యంలో కథ
+ప్రథమార్థం
+ధనుష్ నటన
మైనస్ పాయింట్స్
- నాటకీయత ఎక్కువ కావడం
- పతాక సన్నివేశాలు
ఒక్క మాటలో చెప్పాలంటే.. "సార్ చాలా డీసెంట్"
Next Story