Mon Dec 23 2024 14:29:42 GMT+0000 (Coordinated Universal Time)
'సార్'.. టాలీవుడ్ లో ధనుష్ రచ్చ మొదలైంది కదా..!
'సార్'.. టాలీవుడ్ లో ధనుష్ రచ్చ మొదలైంది కదా..!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కొత్త మూవీ సార్ (SIR). ఈ సినిమా తెలుగుతోపాటు తమిళంలోనూ రూపొందుతోంది. తమిళంలో వాతి పేరుతో రిలీజ్ కానుంది. వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధనుష్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేశారు. 'సార్' టీజర్లో ప్రస్తుత విద్యా వ్యవస్థ గురించి చూపించారు. తాజాగా విడుదల చేసిన టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
బాలగంగాధర్ అనే జూనియర్ లెక్చరర్ పాత్రలో ధనుష్ నటించాడు. 'విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేధ్యంతో సమానం సార్. పంచండి. ఫైవ్ స్టార్ హోటల్లో డిష్‌లాగా అమ్మకండి..' ధనుష్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ధనుష్ ఓన్ వాయిస్ తో తెలుగులో డైలాగ్స్ చెబుతూ ఉంటే అభిమానులకు కూడా కొత్తగా అనిపిస్తూ ఉంది.
భీమ్లా నాయక్ సినిమాలో మెరిసిన సంయుక్తా మీనన్ హీరోయిన్గా చేస్తుండగా.. సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ధనుష్‌కి తెలుగులో ఇది డైరెక్ట్ సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు.
Next Story