Mon Dec 23 2024 18:11:16 GMT+0000 (Coordinated Universal Time)
ధనుష్ కు మద్రాస్ హైకోర్టు షాక్..
రెండేళ్లక్రితం మదురై హైకోర్టు మధురై బెంచ్ లో తల్లిదండ్రుల విషయమై నటుడిపై వచ్చిన అభియోగాలను రద్దు చేసింది. దీంతో దంపతులిద్దరూ
చెన్నై : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మాజీ అల్లుడు ధనుష్ కొంతకాలంగా పలు వివాదాలతో వార్తల్లోకెక్కుతున్నారు. తమిళ స్టార్ హీరో ధనుశ్ కు మేమే అసలైన తల్లిదండ్రులమని కోర్టుకెక్కారు దంపతులు. ధనుష్ తమ మూడో కుమారుడని దంపతులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కోర్టు ధనుశ్ కి సమన్లు సైతం జారీ చేసింది. 2016లో వృద్ధ దంపతులు కతిరేసన్ - మీనాక్షి తమిళనాడు మధురై జిల్లాలోని మేలూర్ మెజిస్ట్రేట్ కోర్టులో నటుడు ధనుష్ తమ కుమారుడని, కొన్నేళ్ల క్రితం సినిమాల్లో నటిస్తానని ఊరువిడిచి పారిపోయాడని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వివాదానికి సంబంధించిన ఫైల్ గత కొంత కాలంగా పెండింగ్ లో ఉండగా మరోసారి తెరపైకి వచ్చింది.
రెండేళ్లక్రితం మదురై హైకోర్టు మధురై బెంచ్ లో తల్లిదండ్రుల విషయమై నటుడిపై వచ్చిన అభియోగాలను రద్దు చేసింది. దీంతో దంపతులిద్దరూ ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ తాజాగా మద్రాస్ హైకోర్ట్ ని ఆశ్రయించారు. తల్లిదండ్రులెవరో నిర్దారించే పరీక్షకు సంబంధించిన నకిలీ పత్రాలను ధనుష్ సమర్పించారని కతిరేసన్ దంపతులు కోర్టును ఆశ్రయించడంతో నటుడికి సమన్లు పంపినట్లు న్యాయస్థానం పేర్కొంది. ధనుష్ సమర్పించిన ఆధారాపై నిజనిర్దారణకు పోలీసులు విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. గతంలో ఈ జంట ధనుష్ బర్త్ సర్టిఫికేట్, 10వ తరగతి సర్టిఫికేట్ మరియు ఫిజికల్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్‌ను కూడా సమర్పించారు.
తన నుంచి ఎలాగైనా డబ్బులు రాబట్టేందుకు వారు ఇలా చేస్తున్నారని.. మేజిస్ట్రేట్ కోర్టులో విచారణను రద్దు చేయాలని ధనుష్ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌ను ఆశ్రయించారు. మొత్తం మీద ఈ వివాదం ధనుష్ కు తలనొప్పిగా మారడంతోపాటు.. మరో వైపు కేసు నడుస్తున్న క్రమంలోనే తమకు ధనుష్ నెలకు అరవై వేల రూపాయల పరిహారం చెల్లించాలని కతిరేషన్ కోరుతున్నారు. ఐశ్వర్య - ధనుష్ రీసెంట్ గా విడిపోయిన విషయం తెలిసిందే.. దీనికి తోడు ఇప్పుడు ఈ కేసులు సమన్లు జారీ కావడం మళ్లీ కోర్టుల చుట్టూ తిరగక తప్పదు. మొత్తానికి ధనుష్ కు దెబ్బమీద దెబ్బ తగులుతోందని అభిమానులు వాపోతున్నారు.
Next Story