Mon Dec 23 2024 08:58:02 GMT+0000 (Coordinated Universal Time)
"ఢీ" కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య
ఈ మేరకు చైతన్య ఆత్మహత్యకు ముందు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో బయటికొచ్చింది. తనకు చాలా అప్పులున్నాయని..
తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది. ప్రముఖ డ్యాన్స్ షో అయిన "ఢీ" కొరియోగ్రాఫర్ గా రాణిస్తోన్న డ్యాన్స్ మాస్టర్ చైతన్య బలవన్మరణానికి పాల్పడ్డాడు. నెల్లూరులోని క్లబ్ హోటల్ లో అతను హ్యాంగ్ చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు చైతన్య ఆత్మహత్యకు ముందు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో బయటికొచ్చింది. తనకు చాలా అప్పులున్నాయని, ఏం చేయాలో, ఎలా తీర్చాలో అర్థంకావడం లేదని చైతన్య ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఈ పని చేస్తున్నందుకు తన తల్లిదండ్రులకు, తన తోటి డ్యాన్స్ మాస్టర్లకు, డ్యాన్సర్లకు సారీ చెప్పాడు చైతన్య. అప్పులు ఇచ్చినవాళ్లు చేసే ఒత్తిడి తట్టుకోలేక పోతున్నానని, మరో దారి లేక ఇలా చేస్తున్నానని తెలిపాడు.
ఒక అప్పును తీర్చేందుకు మరో అప్పు.. అలా అప్పుమీద అప్పుతో అప్పులు పెరిగిపోయాయని వెల్లడించాడు. తనకంటూ ఒక నేమ్, ఫేమ్ ఇచ్చిన ఢీ షోకు ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపాడు. ఢీ ప్రోగ్రాం లో పేరు వచ్చింది కానీ.. సంపాదన తక్కువగా ఇస్తున్నారనీ.. జబర్దస్త్ ప్రోగ్రాంలో ఎక్కువ మనీ ఇస్తున్నారని.. అతడు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చైతన్య మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆయన కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి కేసు నమోదు చేసుకున్నారు.
Next Story