Sat Dec 21 2024 09:51:18 GMT+0000 (Coordinated Universal Time)
స్థలాన్ని అమ్ముకున్న మెగాస్టార్ చిరంజీవి..?
మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. అదేమిటంటే
మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. అదేమిటంటే ఆయన తన స్థలాన్ని అమ్ముకున్నారని.. వేల కోట్ల ఆస్థిపరుడైన మెగాస్టార్ చిరంజీవికి ఓ స్థలం అమ్ముకోవాల్సిన అవసరం ఏమి వచ్చిందా అని పలువురు చెవులు కొరుక్కుంటూ ఉన్నారు. చిరంజీవి తనకు చెందిన ఓ విలువైన స్థలాన్ని అమేశారని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ లోని ఫిలిం నగర్ దగ్గర ఓ స్థలాన్ని అప్పట్లో కొనుగోలు చేశారు. ఆ స్థలం విలువ ఆ కాలంలోనే 30 నుంచి 40 లక్షల వరకు ఉందట. ఇప్పుడు మెగాస్టార్ ఆ స్థలాన్ని ఏకంగా 70 కోట్లకు అమ్మేశారని అంటున్నారు. అయితే చిరంజీవి ఆ స్థలాన్ని ఎందుకు విక్రయించారా అని చాలా మంది చెవులు కొరుక్కుంటూ ఉన్నారు. మంచి రేటు రావడంతో ఈ పని చేశారా అనే కథనాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి ఇంతకు ముందు ఆచార్య సినిమాలో కనిపించాడు. ఆ సినిమా చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. ఇక చిరు ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా నటిస్తూ ఉండడం విశేషం. మలయాళంలో మోహన్ లాల్ చేసిన 'లూసిఫర్' సినిమాకి ఇది రీమేక్. ఆర్ బీ చౌదరి - ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.
Next Story