మహానాయకుడు కోసం డిఫరెంట్ ప్రమోషన్స్..!
ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్ట్‌లుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక పార్ట్ రిలీజ్ అయ్యి ఫెయిల్ అయింది. ప్రస్తుతం రెండో పార్టుకి సంబంధించి షూటింగ్ జరుగుతుంది. [more]
ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్ట్‌లుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక పార్ట్ రిలీజ్ అయ్యి ఫెయిల్ అయింది. ప్రస్తుతం రెండో పార్టుకి సంబంధించి షూటింగ్ జరుగుతుంది. [more]
ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్ట్‌లుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక పార్ట్ రిలీజ్ అయ్యి ఫెయిల్ అయింది. ప్రస్తుతం రెండో పార్టుకి సంబంధించి షూటింగ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే రెండు పార్ట్ లకు సంబంధించి ఒకటే ట్రయిలర్, ఒకటే అడియో ఫంక్షన్ ను నిర్వహించారు మేకర్స్. మొదటి పార్ట్ కథానాయకుడుకి అంతా హడావిడిగా జరిగిపోయింది. అయితే ఇటువంటివి రెండో పార్ట్ మహానాయకుడు విషయంలో జరగకూడదని క్రిష్ భావిస్తున్నాడు. అందుకే రెండోపార్ట్ కి సంబంధించి అదనపు షూట్ తప్పలేదు. ఫస్ట్ పార్ట్ లో లేని ఎమోషనల్ కంటెంట్ ను రెండోపార్ట్ లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
త్వరలో కొత్త ట్రైలర్ వదిలి…
రెండో పార్ట్ రిలీజ్ కు కూడా అందుకే లేట్ అవుతుంది. మొదట ఈ సినిమా వచ్చేనెల 7న రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అయితే దాన్ని 15కు వాయిదా వేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ డేట్ కూడా కాదనుకుని 24 న విడుదల చేయాలని చూస్తున్నారు. అంతేకాదు రెండో పార్టుకి సంబంధించి ట్రైలర్ ని కూడా విడుదల చేయాలని చూస్తున్నారు. ఫస్ట్ వీక్ లో ట్రైలర్ వదలడం, రెండో భాగంపై డిఫరెంట్ పబ్లిసిటీ మెటీరియల్ వదలడం ప్రారంభిస్తారని తెలుస్తోంది. మరి ఇంత కష్టపడుతున్న క్రిష్ టీంకు సక్సెస్ అందుతుందో లేదో చూడాలి.