పవన్ తో సినిమా కామెడీ అయ్యేలా ఉందే!
పవన్ కళ్యాణ్ తో సినిమా విషయంలో నిర్మాతలు ఇప్పుడు కక్కలేక మింగలేక ఉన్నారు. పవన్ క్రేజ్ తో పని జరుగుతుంది.. బోలెడన్ని లాభాలు వెనకేసుకోవచ్చు అని కలలు [more]
పవన్ కళ్యాణ్ తో సినిమా విషయంలో నిర్మాతలు ఇప్పుడు కక్కలేక మింగలేక ఉన్నారు. పవన్ క్రేజ్ తో పని జరుగుతుంది.. బోలెడన్ని లాభాలు వెనకేసుకోవచ్చు అని కలలు [more]
పవన్ కళ్యాణ్ తో సినిమా విషయంలో నిర్మాతలు ఇప్పుడు కక్కలేక మింగలేక ఉన్నారు. పవన్ క్రేజ్ తో పని జరుగుతుంది.. బోలెడన్ని లాభాలు వెనకేసుకోవచ్చు అని కలలు కని.. పవన్ తో ప్రాజెక్ట్స్ మొదలెట్టారు. పవన్ కళ్యాణ్ ఏమో రాజకీయాలకు ఇచ్చిన ప్రాముఖ్యం సినిమాల విషయంలో ఇవ్వడం లేదు. సినిమాలపై శ్రద్ద లేకుండా చేస్తున్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ వ్యవహారం. ఇక దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో సినిమా విషయంలో ఏదో అనుకున్నాడు కానీ ఇప్పుడు తడిసిమోపుడవుతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో షూటింగ్ కోసం ఫ్లైట్ ఎరేంజ్మెంట్స్ చేసిన దిల్ రాజు.. ఇప్పుడు పవన్ కోసం భారీగా ఖర్చులు పెడుతున్నాడట.
అది కూడా పవన్ కళ్యాణ్ కి సెక్యూరిటీ రూపంలో. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నాడు. సో పవన్ కి సెక్యూరిటీ అవసరం అందుకు. ఇక మరో నటుడు కోసం కూడా దిల్ రాజు సెక్యూరిటీ కోసం బడ్జెట్ వెచ్చిస్తున్నాడట. పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ లో నటిస్తున్న ప్రకాష్ రాజ్ కూడా రాజకీయ నాయకుడు కావడం, ఈమధ్యన రాజీకీయాల్తో యాక్టీవ్ గా ఉంటూ అధికార పార్టీ నేతలను విమర్శిస్తూ ఉండడంతో.. ప్రకాష్ రాజు కి థ్రెట్ ఉండడంతో.. ప్రకాష్ రాజ్ వకీల్ సాబ్ షూటింగ్ కి వచ్చినప్పుడు దిల్ రాజే స్వయంగా సెక్యూరిటీ ఎరేంజ్మెంట్స్ చూస్తున్నాడట. మరి పవన్ కళ్యాణ్ కి అపోజిట్ లాయర్ గా ప్రకాష్ రాజ్ వాదిస్తాడట. పవన్ కళ్యాణ్ – ప్రకాష్ రాజ్ కాంబో సీన్స్ కోర్టు సీన్స్ సినిమాకే హైలెట్ అంటున్నారు. ఇక పవన్ తో ఇతర నిర్మాతలు కూడా దిల్ రాజు వలె సెక్యూరిటీ గట్రా ఎగస్ట్రాగా చూసుకోవాల్సిందే. మరి పవన్ క్రేజ్ తో లాభాలేమో గాని.. పవన్ తో సినిమా అంటే కామెడిగా ఉంది అంటున్నారు.