దిల్ రాజు బ్రాండ్ తగ్గిపోతుంది!!!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు కమర్షియల్ సినిమాలు కంటే స్టోరీ బేసెడ్ సినిమాలనే ఎక్కువ తీస్తుంటారు. కథ బలమున్న సినిమాలనే ఎంచుకుంటారు. ఆయన బ్యానర్ లో గతంలో వచ్చిన సినిమాలు చూసుకుంటే వాటిలో బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఆర్య, శతమానం భవతి ఇలా అన్ని సినిమాలు చాలా కొత్తగా అందరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి.
అందరికీ నచ్చేలా......
యూత్ తో పాటు ఫామిలీ ఆడియెన్స్ కి కూడా నచ్చే విధంగా ఆయన సినిమా తీస్తూ ఉంటాడు. మరి ఏమైందో ఏంటో కానీ రాను రాను తన పంధాని మార్చుకుంటున్నారు. కొత్తగా ట్రై చేయడం వల్ల ఎదురుదెబ్బలు తగిలాయనే లేక కమర్షియల్గా సక్సెస్ కావాలనో తెలియదు గానీ.. గత ఏడాది నుండి ఆయన బ్యానర్ నుండి అన్ని కమర్షియల్ చిత్రాలే వస్తున్నాయి. అందుకు భాగంగానే డీజే, నేనులోకల్ చిత్రాలు వచ్చాయి.
కమర్షియల్ చిత్రాలే......
ఇప్పుడు లేటెస్ట్ గా రామ్ హలో గురు ప్రేమ కోసమే సినిమా వచ్చింది. ఇది కూడా రెగ్యులర్ కమర్షియల్ చిత్రమే. మరి ఇటువంటి చిత్రాలు తీస్తున్నా ఇవి సక్సెస్ లు అందుకోలేకపోతున్నాయి. మరి తన నిర్ణయం ఎందుకు మార్చుకున్నాడో తెలియదు కానీ అతని బ్రాండ్ వేల్యూ రోజురోజకి దిగజారిపోతుందని.. ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. మరి ముందు ముందు తన బ్యానర్ లో అందరూ నచ్చే సినిమాలు వస్తాయో లేదో చూడాలి.