ఎఫ్ 2 రీమేక్ పై దిల్ రాజు క్లారిటీ..!
ఈ సంక్రాంతి బరిలో విన్నర్ గా నిలిచిన చిత్రం ఎఫ్ 2. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఆల్రెడీ 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి [more]
ఈ సంక్రాంతి బరిలో విన్నర్ గా నిలిచిన చిత్రం ఎఫ్ 2. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఆల్రెడీ 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి [more]
ఈ సంక్రాంతి బరిలో విన్నర్ గా నిలిచిన చిత్రం ఎఫ్ 2. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఆల్రెడీ 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతోంది. విడుదలై ఇన్ని రోజులు అవుతున్నా ఇంతవరకు ఈ సినిమా ఎక్కడా డౌన్ అవ్వలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా మిగిలిన భాషల్లోకీ వెళ్తోంది. తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా రీమేక్ కానుంది. ఈ విషయాన్ని దిల్రాజు ధృవీకరించారు కూడా. హిందీలో ఈ చిత్రాన్ని రోజుకి కనీసం ఇద్దరు హీరోలు ఈ సినిమా చూస్తున్నారు. హీరోలు ఎవరు అనేదానికి బట్టి దర్శకులు ఎవరు అనేది బయటికి వస్తుంది.
ఒక్కడినే కాదు…
ఈ చిత్రానికి సంబంధించి అన్ని రైట్స్ తన దగ్గరే ఉన్నాయని. కుదిరితే హిందీలో ఈ చిత్రాన్ని తానే నిర్మిస్తానని దిల్ రాజు అంటున్నాడు. కాకపోతే సోలోగా కాదు. నిర్మాణ భాగస్వామిగా నిర్మిస్తానని, ఎందుకంటే తెలుగులో ఈ ఏడాది చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయని ఆయన క్లారిటీ ఇచ్చారు. అలానే 2021 సంక్రాంతికి ఎఫ్ 3 చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అనీల్ ఆల్రెడీ ఓ లైన్ చెప్పాడని, స్క్రిప్ట్ ఇంకా పూర్తి అవ్వాలని, స్క్రిప్ట్ అయ్యాక మూడో హీరో ఎవరు అనేది క్లారిటీ ఇస్తామని చెప్పాడు.