మహర్షి గురించి దిల్ రాజు ఏమన్నాడు?
ఇంతవరకు మహర్షి సినిమా ఎలా ఉంటుందో అన్న విషయం మాత్రం ఎక్కడ బయట రాలేదు. కానీ నిర్మాత దిల్ రాజు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో [more]
ఇంతవరకు మహర్షి సినిమా ఎలా ఉంటుందో అన్న విషయం మాత్రం ఎక్కడ బయట రాలేదు. కానీ నిర్మాత దిల్ రాజు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో [more]
ఇంతవరకు మహర్షి సినిమా ఎలా ఉంటుందో అన్న విషయం మాత్రం ఎక్కడ బయట రాలేదు. కానీ నిర్మాత దిల్ రాజు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో సినిమా ఎలా ఉండబోతుంది అని ఓ హింట్ ఇచ్చారు. ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. అసలు ఆయన ఏమి చెప్పారు?
మహర్షి సినిమా చూసి బయటికి వచ్చేవారు బరువైన హృదయంతో బయటకు వస్తారు అని అంటున్నాడు. ఈ మూవీ మహేష్ పర్సనల్ లైఫ్ కి దగ్గరకు ఉంటుందని చెబుతున్నాడు. ఫామిలీ ఎమోషన్స్ , ఫ్రెండ్ షిప్ లో ఉండే ఎమోషన్. సొసైటీ లో ఉండే ఎమోషన్ అన్ని మహర్షి సినిమాలో ఉంటున్నాయని రాజు అంటున్నారు. అసలు మహర్షి ఎవరు? ఆయన ఎందుకు మహర్షి గా మారుతారు? అనేది సినిమాలో చూడాలని అంటున్నారు దిల్ రాజు.
అంటే ఇది టోటల్ గా ఫీల్ గుడ్ మూవీ అని అర్ధం అవుతుంది. మరి ఇటువంటి మూవీస్ గతంలో ఆడిన సందర్భాలు లేవు. టాక్ అయితే బాగుంది అని వచ్చినా వసూల్ మాత్రం రాలేదు. వంశీ పైడిపల్లి ఊపిరి సినిమా కాస్ట్ ఫెయిల్యూర్. దానికి ప్రశంసలు మాత్రమే మిగిలాయి. పైగా మహర్షి లో మళ్లీ పల్లెటూరు, వ్యవసాయం, లాభసాటి లాంటి వ్యవహారాలు ఉంటాయి. మరి ప్రేక్షకులు సినిమా ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ప్రస్తుతం ఈ విషయం మహేష్ ఫ్యాన్స్ ని కలవరపెడుతుంది.