Fri Dec 20 2024 00:02:29 GMT+0000 (Coordinated Universal Time)
Game Changer : 'గేమ్ ఛేంజర్' అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు.. అదేంటంటే..
రామ్ చరణ్ అభిమానులంతా ఎదురుచూస్తున్న 'గేమ్ ఛేంజర్' అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు. అదేంటంటే..
Game Changer : ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్.. ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్'ని అనౌన్స్ చేసి భారీ అంచనాలను క్రియేట్ చేసారు. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎప్పుడు చూస్తామా అని అభిమానులంతా ఎదురు చూస్తుంటే.. మేకర్స్ మాత్రం మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటూనే వస్తున్నారు. షూటింగ్ లో ఆలస్యం మాత్రమే కాదు, ఒక చిన్న అప్డేట్ కూడా ఇవ్వకుండా ఫ్యాన్స్ ని నిరాశ పరుస్తూ వచ్చారు.
అయితే ఇప్పుడు ఫ్యాన్స్ ని ఖుషి చేయడానికి నిర్మాత దిల్ రాజు క్రేజీ అప్డేట్ ని తీసుకువచ్చారు. ఒక మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న దిల్ రాజు మాట్లాడుతూ.. "రామ్ చరణ్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి. మార్చి 27న చరణ్ బర్త్ డే నాడు క్రేజీ అప్డేట్ రాబోతుంది" అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా ఈ అప్డేట్ ‘జరగండి జరగండి’ సాంగ్ గురించే అని తెలుస్తుంది.
ఆల్రెడీ ఈ పాట నెట్టింట లీక్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరి ఇప్పుడు ఈ పాటని మాత్రమే రిలీజ్ చేస్తారా..? లేదా మూవీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ని మరింత ఖుషి చేస్తారా..? అనేది చూడాలి. కాగా ఈ సినిమాని సెప్టెంబర్ సమయంలో రిలీజ్ చేస్తామంటూ దిల్ రాజు గతంలోనే చెప్పుకొచ్చారు. ఇక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ విభిన్న రోల్స్ ఆకట్టుకోకున్నారని చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ చూపించిన వేరియేషన్స్ కంటే ఎక్కువుగా ఈ మూవీలో చూపించబోతున్నారని చెబుతున్నారు.
Next Story