Sun Dec 22 2024 22:19:21 GMT+0000 (Coordinated Universal Time)
Game Changer : గేమ్ ఛేంజర్ రిలీజ్ ఎప్పుడో చెప్పిన దిల్ రాజు..
గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు సినిమాని ఎప్పుడు రిలీజ్ చేసేది అభిమానులకు తెలియజేశారు.
Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న పొలిటికల్ డ్రామా 'గేమ్ ఛేంజర్'. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమ ప్రొడక్షన్ లో 50వ చిత్రంగా వస్తుండడంతో.. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా గేమ్ ఛేంజర్ ని తెరకెక్కిస్తున్నారు. 2021లో షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం.. షూటింగ్ ఇండియన్ 2 వల్ల లేటు అవుతూ వచ్చింది.
ఇక సినిమా అనౌన్స్ చేసి మూడేళ్లు అవుతుంది కానీ ఈ మూవీ నుంచి ఒక టైటిల్ గ్లింప్స్ తప్ప మరే అప్డేట్ రాలేదు. ఆ మధ్య మూవీ నుంచి మొదటి సాంగ్ రిలీజ్ చేస్తామంటూ ప్రకటించి, మళ్ళీ పోస్టుపోన్ చేశారు. దీంతో చరణ్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా దిల్ రాజు ఒక గుడ్ న్యూస్ ని ఫ్యాన్స్ కి తెలియజేశారు. గేమ్ ఛేంజర్ ని ఎప్పుడు రిలీజ్ చేసేది అభిమానులకు తెలియజేశారు.
రీసెంట్ గా ప్రభాస్ నటించిన సలార్ సినిమా చూసేందుకు థియేటర్ కి వచ్చిన దిల్ రాజుని.. చరణ్ అభిమానులు గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ గురించి ప్రశ్నించారు. దానికి దిల్ రాజు బదులిస్తూ.. 2024 సెప్టెంబర్ అని బదులిచ్చారు. ఇక ఈ వార్తతో చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి ఈ న్యూ ఇయర్ లేదా సంక్రాంతికి.. ఆ పోస్టుపోన్ చేసిన సాంగ్ ని కూడా రిలీజ్ చేస్తారేమో చూడాలి.
కాగా గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నారు. ఈ రెండు పాత్రలు మాత్రమే కాదు, ఈ సినిమాలో చరణ్ చాలా డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నారని తెలుస్తుంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి.. తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథని అందిస్తున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీకాంత్, సునీల్, ఎస్ జె సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Next Story