Fri Dec 20 2024 18:07:43 GMT+0000 (Coordinated Universal Time)
Game Changer : 'గేమ్ ఛేంజర్' అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. రిలీజ్ డేట్ని..
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' షూటింగ్ అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు. రిలీజ్ డేట్ని..
Game Changer : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' వంటి గ్లోబల్ సక్సెస్ తరువాత చేస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం కావడం మరో హైలైట్. సామజిక సమస్యలను కమర్షియల్ గా చూపించి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసే శంకర్.. రోబో తరువాత నుంచి తన హిట్ ఫార్ములాని పక్కన పెట్టి టెక్నికల్ మూవీస్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ తో మళ్ళీ తన హిట్ ఫార్ములాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు.
ఈ సినిమా కథ పొలిటికల్ సిస్టమ్ లోని తప్పులని ప్రశ్నించేలా ఉంటుందని చెబుతున్నారు. ఇక శంకర్ మళ్ళీ తన హిట్ ఫార్ములాతో సినిమా తెరకెక్కించడం, ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మెగా అభిమానులతో పాటు టాలీవుడ్, కోలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇండియన్ 2 వల్ల ఈ మూవీ షూటింగ్ లేట్ అవుతూ వస్తుంది.
ఈక్రమంలోనే గేమ్ ఛేంజర్ షూటింగ్ సగం కూడా అవ్వలేదని వార్తలు వస్తున్నాయి. ఈ న్యూస్ చూసిన అభిమానులు దిగులు చెందుతున్నారు. తాజాగా దిల్ రాజు గేమ్ ఛేంజర్ షూటింగ్ అప్డేట్ ని ఇచ్చారు. ఆల్మోస్ట్ 80 శాతం షూటింగ్ పూర్తి అయ్యినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మైసూర్ లో జరుగుతున్న షెడ్యూల్ నేటితో పూర్తి అవుతుందని వెల్లడించారు. బ్యాలన్స్ షూట్ ని కూడా త్వరలోనే పూర్తి చేయనున్నారని పేర్కొన్నారు.
మొత్తం షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వెళ్లిన తరువాతే.. రిలీజ్ డేట్ గురించి ఆలోచిస్తామని తెలియజేశారు. 2024 ఫిబ్రవరికి ఈ మూవీ షూటింగ్ అయ్యిపోయే అవకాశం ఉందని, దసరాకి ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారని ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు ఎప్పుడు వస్తుందో చూడాలి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి, శ్రీకాంత్, ఎస్ జె సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Next Story