చిన్న నిర్మాతలకు దిల్ రాజు సలహాలు
చాలా రోజుల నుండి చిన్న సినిమాల నిర్మాతలు థియేటర్ల కేటాయించే విషయంలో పెద్ద నిర్మాతలపై పలు ఆరోపణలు చేస్తున్నారు. ఇండస్ట్రీలోని పెద్దలు.. చిన్న సినిమాల నిర్మాతలకు థియేటర్స్ [more]
చాలా రోజుల నుండి చిన్న సినిమాల నిర్మాతలు థియేటర్ల కేటాయించే విషయంలో పెద్ద నిర్మాతలపై పలు ఆరోపణలు చేస్తున్నారు. ఇండస్ట్రీలోని పెద్దలు.. చిన్న సినిమాల నిర్మాతలకు థియేటర్స్ [more]
చాలా రోజుల నుండి చిన్న సినిమాల నిర్మాతలు థియేటర్ల కేటాయించే విషయంలో పెద్ద నిర్మాతలపై పలు ఆరోపణలు చేస్తున్నారు. ఇండస్ట్రీలోని పెద్దలు.. చిన్న సినిమాల నిర్మాతలకు థియేటర్స్ ఇవ్వకుండా తమ సినిమాల కోసం బ్లాక్ చేస్తున్నారని వీరి ప్రధాన ఆరోపణ. అయితే ఈ రచ్చ సంక్రాతి సీజన్ లో బాగా హైలెట్ అయ్యింది. సంక్రాంతికి ఒక నిర్మాత పెద్ద నిర్మాతలపై పచ్చిగా నోరు పారేసుకున్నాడు. అయితే పెద్ద నిర్మాతలైన వారిలో ఎక్కువగా అందరూ దిల్ రోజునే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. దిల్ రాజు కొనే, నిర్మించే సినిమాలకే ఎక్కువ థియేటర్స్ కేటాయించి.. చిన్న సినిమాలకు అన్యాయం చేస్తున్నాడని వారి బాధ.
సినిమాలో విషయం ఉండాలి…
తాజాగా దిల్ రాజు ఈ విషయమై స్పందిస్తూ.. మేము థియేటర్స్ ని బ్లాక్ చేశామనడంలో నిజం లేదు. సినిమాలో కంటెంట్ ఉంటే.. ఆయా సినిమాలకు ఆటోమాటిక్ గా థియేటర్స్ పెంచుతారు. అంతేగానీ మేము చెబితే ఎవరూ ఆపరు అని అంటున్నాడు. కంటెంట్ లేని సినిమాలకు థియేటర్స్ కేటాయించి ఏం లాభం, కంటెంట్ ఉంటే సినిమా ఆడుతుంది, లేదంటే ఆడదు. ఆర్ఎక్స్ 100 సినిమా థియేటర్స్ లోకి వచ్చినప్పుడు ఎటువంటి హడావిడి, ప్రమోషన్స్ లేదు. కానీ సినిమా విడుదలయ్యాక సినిమాలో కంటెంట్ ఉంది. రెండో రోజుకే థియేటర్స్ పెంచాల్సిన పరిస్థితి. మరి అన్ని సినిమాలకి ఆర్ఎక్స్ 100 అంత దమ్మున్న కంటెంట్ ఉంటే.. థియేటర్స్ వాటికవే వస్తాయి.
కోటి ఖర్చు పెట్టాలంట…
అయినా సినిమా తీశామా విడుదల చేశామా అన్నట్టుగా కాకుండా… ఆ సినిమాని మనసు పెట్టి తీసి, మంచి ప్రమోషన్స్ చెయ్యాలి. ప్రమోషన్ కోసం కనీసం కోటి ఖర్చు పెట్టమని దిల్ రాజు సలహా ఇస్తున్నాడు. చిన్న సినిమాల నిర్మాతలకు కోటి ప్రమోషన్స్ కోసం ఖర్చు పెట్టడం అంటే… వారికి మరో సినిమా బడ్జెట్ అంత. మరి కోటి ఖర్చు పెట్టి ప్రమోషన్స్ చెయ్యడం అంటే మాటలు కాదు. మరి దిల్ రాజు అలా అనడం చూస్తుంటే.. చిన్న సినిమాలు చేసే నిర్మాతలు ప్రమోషన్స్ కోసం కోటి పక్కన పెట్టుకోవాల్సిందే.