దిల్ రాజు చేతికి కీర్తి సురేష్ సినిమా
కీర్తి సురేష్ – ఆది పినిశెట్టి కాంబినేషన్ లో ఒక సినిమా 10 రోజులు షూటింగ్ జరుపుకుని ఆగిపోయింది. నగేష్ కుకునూరు డైరక్షన్ లో స్టార్ట్ అయినా [more]
కీర్తి సురేష్ – ఆది పినిశెట్టి కాంబినేషన్ లో ఒక సినిమా 10 రోజులు షూటింగ్ జరుపుకుని ఆగిపోయింది. నగేష్ కుకునూరు డైరక్షన్ లో స్టార్ట్ అయినా [more]
కీర్తి సురేష్ – ఆది పినిశెట్టి కాంబినేషన్ లో ఒక సినిమా 10 రోజులు షూటింగ్ జరుపుకుని ఆగిపోయింది. నగేష్ కుకునూరు డైరక్షన్ లో స్టార్ట్ అయినా ఈసినిమాను ఇప్పుడు దిల్ రాజు హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆఫీసర్ సినిమాతో ఈ సినిమా నిర్మాత ఒకరు కావడంతో కొన్ని సమస్యలు వచ్చాయని, వాటిని వేరే విధంగా సర్దుబాటు చేసుకుంటున్నారని బోగట్టా.
ఇక హీరోయిన్ కీర్తి కూడా ఈమూవీ చేయాలా? వద్దా? అనే డైలమాలో పడింది. అందుకే ఈసినిమాను దిల్ రాజు దగ్గరకు తీసుకుని వెళ్లారు. మరి ఇప్పుడు కీర్తి నో చెప్బుతుందా లేదా చూడాలి. సినిమా సగంలో ఆగిపోగూడదు అని దిల్ రాజు చేతిలో పెట్టారు ఈసినిమాను.
ఇక కీర్తి సురేష్ ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేస్తుంది. ప్రస్తుతానికి తన దగ్గర డేట్స్ కూడా లేవు ఈసినిమా కి ఇవ్వడానికి. మరి దిల్ రాజు దీన్ని ఎలా హేండిల్ చేస్తాడో చూడాలి.