Sun Dec 22 2024 18:35:13 GMT+0000 (Coordinated Universal Time)
జవాన్ సినిమాపై క్రికెటర్ దినేశ్ కార్తీక్.. 2018లోనే ఈ మూవీ..
జవాన్ గురించి పలువురు సెలబ్రిటీస్ ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు. తాజాగా స్టార్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కూడా ఈ మూవీ గురించి ఇంటరెస్టింగ్ ట్వీట్ చేశాడు.
షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన జవాన్ (Jawan) మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి పలువురు సెలబ్రిటీస్ ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు. మహేష్ బాబు, రాజమౌళి, ఆనంద్ మహీంద్రా.. ఇలాంటి ప్రముఖులు అంతా సినిమాని, షారుఖ్ ని అభినందిస్తూ వస్తున్నారు. తాజాగా స్టార్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) కూడా ఈ మూవీ గురించి ఇంటరెస్టింగ్ ట్వీట్ చేశాడు.
ఐపీల్ లోని షారుఖ్ టీం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో దినేశ్ కార్తీక్ 2018 నుంచి తన ప్రయాణం మొదలు పెట్టాడు. ఇక ఒకసారి చెన్నై అండ్ కోల్‌కతా మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో అట్లీ దానిని చూసేందుకు అక్కడికి వచ్చాడట. ఇక ఆ సమయంలోనే దర్శకుడు అట్లీ, షారుఖ్ ఖాన్ మధ్య ఈ సినిమాకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని దినేష్ కార్తీక్ తెలియజేశాడు. చిన్న చిన్న మార్పులు, చాలా చర్చులు జరిపి, చివరికి ప్రతీ ప్రేమ్ ను అద్భుతంగా తీర్చిదిద్దెందుకు 5 సంవత్సరాలు పట్టింది అంటూ పేర్కొన్నాడు.
ఇక మూవీలో షారుఖ్ డిఫరెంట్ గెటప్స్ చూపించడానికి అట్లీ చాలా కష్టపడదని, అందుకనే షారుఖ్ లో మునుపు ఎన్నడూ చూడని చరిష్మా ఈ చిత్రంలో కనిపించిందని వెల్లడించాడు. తనకి విక్రమ్ రాథోడ్ పాత్ర స్టైల్ బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు. అలాగే విజయ్‌సేతుపతి, నయనతార నటన అందర్నీ కట్టిపడేసిందని పేర్కొన్నాడు. అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు సినిమాకే హైలైట్ అని వెల్లడించాడు. ఇక ఈ జవాన్ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిపోతుంది అంటూ ట్వీట్ చేశాడు.
Next Story