Mon Dec 23 2024 07:33:18 GMT+0000 (Coordinated Universal Time)
మరో స్టార్ డైరెక్టర్ విడాకులు
తాజాగా మరో డైరెక్టర్ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఇటీవలే ఫ్యామిలీ కోర్టులో విడాకులు పొందారు. 17 ఏళ్ల క్రితం..
చెన్నై : చిత్రపరిశ్రమలో విడాకుల పర్వం కొనసాగుతోంది. హీరో-హీరోయిన్లు, స్టార్ కపుల్స్ ఒకరి తర్వాత ఒకరు విడాకుల ప్రకటన చేస్తూ.. అభిమానులకు వరుస షాక్ లు ఇస్తున్నారు. నాగచైతన్య-సమంత విడాకుల తర్వాత.. స్టార్ హీరో ధనుష్-ఐశ్వర్యలు విడాకుల ప్రకటన చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఈ రెండు జంటలు ఇచ్చిన షాక్ నుంచే అభిమానులు ఇంకా తేరుకోలేదు. తాజాగా మరో డైరెక్టర్ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు.
కోలీవుడ్ డైరెక్టర్ బాలా తన భార్యతో లీగల్ గా విడాకులు తీసుకున్నారు. ఇటీవలే ఫ్యామిలీ కోర్టులో విడాకులు పొందారు. 17 ఏళ్ల క్రితం ముత్తు మలర్ తో బాలా కు వివాహం జరిగింది. వీరికి ఒక పాప ఉంది. భార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తడంతో 17 ఏళ్ల వైవాహిక బంధానికి విడాకులతో స్వస్తి పలికారు. మనస్పర్థల కారణంగా నాలుగేళ్లుగా వీరు విడిగానే ఉంటున్నారు. మ్యూచువల్ విడాకులకు అప్లై చేయగా.. ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. కాగా.. బాలాదిత్య తమిళంలోనే కాకుండా తెలుగులోనూ పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాలా తెరకెక్కించిన శివపుత్రుడు, శేషు, వాడు- వీడు చిత్రాలు తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి.
Next Story