Sun Dec 22 2024 22:59:21 GMT+0000 (Coordinated Universal Time)
డైరెక్టర్ గోపీచంద్ కి రజనీకాంత్ కి ఫోన్
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా.. సంక్రాంతి సందర్భంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.
నందమూరి బాలకృష్ణ హీరోగా.. డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన కంప్లీట్ యాక్షన్ డ్రామా వీరసింహారెడ్డి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా.. సంక్రాంతి సందర్భంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. బాలయ్య కెరీర్లోనే ఘన విజయం సాధించిన చిత్రాల్లో వీరసింహారెడ్డి ఒకటిగా నిలిచింది. బాలయ్యకు తగ్గట్టుగా ఈ సినిమాను తీసిన డైరెక్టర్ గోపీచంద్ ను పలువురు ప్రశంసిస్తున్నారు.
తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ డైరెక్టర్ గోపీచంద్ కి ఫోన్ చేశారట. ఈ విషయాన్ని గోపీచందే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. సూపర్ స్టార్ రజనీకాంత్ వీరసింహారెడ్డి సినిమా చూసి.. గోపీచంద్ కు కాల్ చేశారు. "ఇది నాకు నమ్మలేని క్షణం. సూపర్ స్టార్, తలైవర్ రజనీకాంత్ సార్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన వీరసింహారెడ్డి సినిమాను చూశారు. ఆయనకు సినిమా ఎంతో నచ్చింది. సినిమాను ప్రశంసిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన భావోద్వేగం ఈ ప్రపంచంలో తనకు అన్నింటి కంటే ఎక్కువ. థాంక్యూ రజనీ సార్" అని ట్వీట్ చేశారు.
Next Story