Fri Apr 11 2025 03:05:52 GMT+0000 (Coordinated Universal Time)
దర్శకుడు గుణశేఖర్ ఇంట పెళ్లిసందడి..ఘనంగా కూతురి వివాహం
పెళ్లికి హాజరైన సినీ ప్రముఖుల్లో మెగాస్టార్ చిరంజీవి దంపతులు, నిర్మాత అల్లు అరవింద్, బండ్ల గణేశ్ ఉన్నారు. అలాగే తెలంగాణ

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ కుమార్తె, నిర్మాత నీలిమ గుణ వివాహం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త రవి ప్రక్యాతో హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో వీరి వివాహం జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై.. నవ దంపతులు నీలిమ-రవిలను ఆశీర్వదించారు.
పెళ్లికి హాజరైన సినీ ప్రముఖుల్లో మెగాస్టార్ చిరంజీవి దంపతులు, నిర్మాత అల్లు అరవింద్, బండ్ల గణేశ్ ఉన్నారు. అలాగే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. కాగా.. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన రుద్రమదేవి సినిమాకు నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరించారు. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న 'శాకుంతలం' సినిమాను కూడా నీలిమ నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Next Story