Sun Dec 22 2024 03:02:14 GMT+0000 (Coordinated Universal Time)
Harish Shankar : ఆగిపోయిన ఎవరో కారుని తోస్తూ.. డైరెక్టర్ హరీష్ శంకర్..
డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ రోడ్డు మీద ఆగిపోయి ఉన్న ఓ కారుని నెడుతూ కనిపించారు.
Harish Shankar : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ రోడ్డు మీద ఆగిపోయి ఉన్న ఓ కారుని నెడుతూ కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ దర్శకుడు, నిర్మాత కలిసి పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరు కలిసి హైదరాబాద్ లో ఓ కారులో ప్రయాణిస్తుండగా.. ఒక చోట ట్రాఫిక్ జామ్ అయ్యింది.
అందుకు కారణం ఏంటని తెలుసుకోగా.. ఒక కారు రోడ్డు మధ్యలో నిలిచిపోయిందని, అది స్టార్ట్ కావడం లేదని తెలిసింది. దీంతో హరీష్ శంకర్, రవి శంకర్ కిందకి దిగి.. ఆ కారు సమస్య ఏంటో తెలుసుకొని.. స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేసారు. ఈక్రమంలోనే రోడ్డు పై అడ్డంగా ఆగిపోయిన ఎవరో కారుని తోస్తూ దర్శకనిర్మాతలు కనిపించారు. ఇక ఈ వైరల్ అవుతున్న వీడియో పలువురు సరదాగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.
కాగా హరీష్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్'ని పక్కన పెట్టేసి రవితేజతో 'మిస్టర్ బచ్చన్' చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆగిపోయిందా..? ఆ చిత్రాన్ని ఇంక తెరకెక్కించరా..? అనే ప్రశ్నలు ఫ్యాన్స్ లో కలుగుతున్నాయి. అయితే ఈ ప్రశ్నలు అన్నిటికి హరీష్ శంకర్ తాజా ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చేసారు. పవన్ పొలిటికల్ బిజీ వలెనే షూటింగ్ కి బ్రేక్ పడింది గాని, సినిమాకి ఎండ్ పడలేదని తెలియజేసేసారు.
అలాగే మూవీ గురించి కూడా మాట్లాడుతూ.." గబ్బర్ సింగ్ టైంలో మాకు సెట్స్ లో ఒక వైబ్ ఉండేది. అదే వైబ్ ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కిస్తున్న సమయంలో కూడా కనిపించింది. గబ్బర్ సింగ్ రిజల్ట్ ని మళ్ళీ ఉస్తాద్ చూస్తారు" అని చెప్పుకొచ్చారు. మరి ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి. కాగా ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు.
Next Story