Mon Dec 23 2024 08:25:11 GMT+0000 (Coordinated Universal Time)
Unstoppable 2 : హరిహర వీరమల్లు పై అంచనాలు పెంచేసిన డైరెక్టర్ క్రిష్
డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి గతంలో బాలకృష్ణతో గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ మహానాయకుడు, కథానాయకుడు సినిమాలని..
బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్స్టాపబుల్ షో సూపర్ గా సక్సెస్ అయింది. మొదటి సీజన్ కంటే.. రెండో సీజన్ ఇండియాలోనే టాప్ టాక్ షో గా నిలిచింది. ఈ సీజన్ కు పవన్ కల్యాణ్ తో గ్రాండ్ గా ఎండ్ కార్డు వేసింది ఆహా. రెండో ఎపిసోడ్ లో పవన్ రాజకీయాల గురించే ఎక్కువగా మాట్లాడారు. ఇక పవన్ తో కలిసి త్రివిక్రమ్ వస్తారనుకున్నారంతా. కానీ ఫస్ట్ ఎపిసోడ్ లో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రాగా.. రెండో ఎపిసోడ్ లో హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్ వచ్చారు.
డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి గతంలో బాలకృష్ణతో గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ మహానాయకుడు, కథానాయకుడు సినిమాలని తెరకెక్కించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరిహరవీరమల్లు సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా పవన్ తో అన్ స్టాపబుల్ 2 కి వచ్చిన క్రిష్.. హరిహర వీరమల్లు గురించి ముచ్చటించారు. హరిహరవీరమల్లు సినిమా ఔరంగజేబు రూలింగ్ కాలంలో జరిగే కథ అని పవన్ చెప్పారు. క్రిష్ మాట్లాడుతూ.. మీ ఇద్దరికీ సపరేట్ గా కథలు చెప్పాను కాని, ఇలా ఇద్దరి మధ్య ఒకేసారి కూర్చోవడం మొదటిసారి. ఒక సింహం, పులి మధ్య తల పెట్టినట్టు ఉంది. అందుకే త్రివిక్రమ్ గారు తప్పించుకున్నారు అనుకుంట అన్నారు.
గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత మళ్లీ పీరియాడికల్, హిస్టారికల్ సినిమాలు తీయొద్దని అనుకున్నాను. కానీ పవన్ గారితో సినిమా అన్నప్పుడు ఆయన అన్ని రకాల సినిమాలు తీశారు. పీరియాడికల్ తీయలేదు. అందుకే మళ్ళీ పీరియాడికల్ కథతోనే ఆయన దగ్గరికి వెళ్లి కథ చెప్తే ఓకే అన్నారు. ఇన్నాళ్లు మీరు తొడ కొట్టారు. ఇప్పుడు పవన్ ఈ సినిమాలో తొడ కొడతాడు అని చెప్తూ సినిమాపై కూడా అంచనాలు పెంచేశారు క్రిష్.
Next Story