Mon Dec 23 2024 14:36:37 GMT+0000 (Coordinated Universal Time)
చెక్ బౌన్స్ కేసు : ది వారియర్ దర్శకుడికి 6 నెలలు జైలు శిక్ష
తెలుగు, తమిళ కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన లింగుస్వామికి చెక్ బౌన్స్ కేసులో చెన్నైలోని సైదాపేట్ కోర్టు 6 నెలలు
ఇటీవల విడుదలైన "ది వారియర్" చిత్ర దర్శకుడు లింగుస్వామికి చెక్ బౌన్స్ కేసులో 6 నెలలు జైలు శిక్ష పడింది. తెలుగు, తమిళ కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన లింగుస్వామికి చెక్ బౌన్స్ కేసులో చెన్నైలోని సైదాపేట్ కోర్టు 6 నెలలు జైలు శిక్ష విధించింది. కొన్ని సంవత్సరాల క్రితం కార్తి, సమంత జంటగా 'ఎన్నిఇజు నాల్ కుల్ల' పేరుతో ఒక సినిమా తీయాని లింగుస్వామి, అతని సోదరుడు సుభాష్ చంద్రబోస్ భావించారు. ఈ సినిమా కోసం పీవీసీ సినిమాస్ నుంచి కొంత మొత్తం అప్పుతీసుకున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి రాకపోవడంతో.. పీవీపీ సినిమాస్ నుంచి తీసుకున్న సొమ్మును తిరిగి చెల్లించేందుకు ఒక చెక్ ఇచ్చారు.
పీవీపీ సినిమాస్ కు ఇచ్చిన చెక్ బౌన్స్ అవడంతో.. పీవీపీ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సైదాపేట్ కోర్టు.. లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్ లకు 6 నెలలు జైలుశిక్ష విధించింది. కోర్టు ఇచ్చిన తీర్పుపై లింగుస్వామి సోదరులు అప్పీలుకు వెళ్లనున్నారు. కాగా.. లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ హౌస్ పేరుతో పలు సినిమాలను కూడా నిర్మించగా.. ఆ నిర్మాణ సంస్థపై కూడా పలు కేసులున్నాయి.
Next Story