Thu Dec 26 2024 16:47:55 GMT+0000 (Coordinated Universal Time)
Mega157లో చిరంజీవి పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పిన దర్శకుడు..
Mega157 లో చిరంజీవి పాత్ర ఎలా ఉంటుందో చెప్పిన దర్శకుడు వశిష్ఠ. ఈ సినిమాలోని చిరు పాత్ర..
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇటీవల 'భోళాశంకర్' సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి భారీ పరాజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు ఈ మూవీతో అనేక విమర్శలు కూడా ఎదురుకున్నాడు. వయసుకి తగ్గ పాత్రలు చేయడం లేదని కామెంట్స్ వినిపించాయి. ఒక పక్క రజినీకాంత్, కమల్ హాసన్ తమ ఏజ్ కి తగ్గ పాత్రలు చేసి మెప్పిస్తుండడంతో మెగా అభిమానులు నుంచి కూడా చిరు ఎంచుకొనే పాత్రలు పై వ్యతిరేకత వచ్చింది.
దీంతో చిరు కూడా ఇప్పుడు అందుకు తగ్గ కథలే ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి.. బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తన 157వ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ ఆల్రెడీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. కాగా దర్శకుడు వశిష్ఠ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో Mega157లో చిరంజీవి పాత్ర ఎలా ఉండబోతుందో తెలియజేశాడు.
ఈ మూవీలో చిరంజీవిని మెచ్యూర్ క్యారెక్టర్లో చూపించబోతున్నాడట. చిరు ఏజ్ అండ్ రేంజ్ కి తగ్గట్టు సినిమాలోని పాత్ర ఉంటుందని చెప్పుకొచ్చాడు. 'విక్రమ్'లో కమల్ హాసన్, 'జైలర్'లో రజినీకాంత్ పాత్రలు ఎలా పవర్ ఫుల్ గా ఉన్నాయో.. ఈ సినిమాలోని చిరు పాత్ర కూడా అలానే ఉంటుందని పేర్కొన్నాడు. మూవీలో చిరంజీవికి ఎలాంటి రొమాన్స్ సీన్స్ ఉండవని వెల్లడించాడు. అలాగే 'జగదేకవీరుడు అతిలోక సుందరి' మూవీలా సోషియో ఫాంటసీతో సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు.
ఇక వశిష్ఠ కామెంట్స్ తో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా ఈ సినిమాని నవంబర్ లో సెట్స్ పైకి తీసుకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. చోట కె నాయుడు ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా పని చేయబోతున్నాడు. గతంలో చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ మూవీ 'అంజి' కూడా చోట కె నాయుడే డిఒపిగా చేశాడు.
Next Story