Sat Dec 21 2024 04:52:20 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభాస్తో నేను చేస్తున్నది ఒక ట్రయిల్.. మారుతి వైరల్ కామెంట్స్..
ప్రభాస్తో మారుతి తెరకెక్కిస్తున్న షూటింగ్ అంతా ఒక ట్రయిల్ అని తెలియజేశాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్, కల్కి 2898 AD వంటి భారీ సినిమాలను నటిస్తున్న సంగతి తెలుస్తుంది. ఇక ఈ సినిమాలతో పాటు కామెడీ చిత్రాలు తెరకెక్కించే మారుతితో కూడా ఒక సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలు పెట్టుకున్న మూవీ నుంచి ప్రభాస్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. అయితే దర్శకనిర్మాతలు మాత్రం ఇప్పటివరకు ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఆడియన్స్ లో చాలా సందేహాలు నెలకొన్నాయి.
మూవీ ఏ జోనర్ లో తెరెక్కుతోంది..? ప్రభాస్ ఏ పాత్రతో ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు..? మారుతి మునపటి సినిమాలు మాదిరి ఈ మూవీలో హీరోకి కూడా ఏదొక డిఫెక్ట్ ఉంటుందా? అనే సందేహాలు నెలకొన్నాయి. కాగా మారుతి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో మారుతి ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేశాడు. ప్రభాస్ ప్రస్తుతం అనేక సినిమాల్లో నటిస్తున్నాడు. దీంతో ఏ మూవీ అప్డేట్ ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. ఇలాంటి సమయంలో తమ సినిమా అప్డేట్ ఇస్తే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పుకొచ్చాడు.
అలాగే ఈ కన్ఫ్యూజనతో రిలీజ్ సమయానికి మూవీ పై బజ్ తగ్గే అవకాశం కూడా ఉంటుందని వెల్లడించాడు. సలార్, కల్కి వంటి భారీ ప్రాజెక్ట్స్ చేసే ప్రభాస్.. తనలాంటి మిడ్ రేంజ్ దర్శకుడికి ఇచ్చిన ఛాన్స్ ని నిలబెట్టుకుంటాని పేర్కొన్నాడు. ప్రభాస్ లీకైన లుక్స్ చూసి చాలా బాగున్నాయని ప్రేక్షకుల నుంచి కామెంట్స్ వచ్చాయి. అలాగే మూవీలో ప్రభాస్ పాత్ర కూడా కొత్తగా ఉంటుందని వెల్లడించాడు. తన మునపటి సినిమాలు మాదిరి హీరో బాగా కామెడీ చేస్తాడని చెప్పుకొచ్చాడు.
కాగా ఇప్పటివరకు జరిగిన షూట్ అంతా కేవలం ట్రయిల్ మాత్రమే అంట, జస్ట్ కొన్ని కామెడీ సీన్స్ తెరకెక్కించారంట. నిజమైన షూటింగ్ నవంబర్ నెల నుంచి మొదలవుతుందని వెల్లడించాడు. ఇక ఈ మూవీ ఏ జోనర్ లో ఉండబోతుంది, హీరో డిఫెక్ట్ అనేదాని గురించి ఇప్పుడు చెప్పలేనని, షూటింగ్ మొదలైన దగ్గర నుంచి అప్డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తామని వెల్లడించాడు.
Next Story