Mon Nov 18 2024 08:31:28 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభాస్ కల్కి VFX కుదరలేదు.. దర్శకుడు నాగ్ అశ్విన్..
ప్రభాస్ కల్కి VFX విషయంలో కుదరలేదు. నెక్స్ట్ టైం తప్పకుండా ప్రయత్నిస్తా అంటూ దర్శకుడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ సూపర్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న మూవీ 'కల్కి 2898 AD'. ఆధునిక టెక్నాలజీ నేపథ్యంతో సాగే ఈ మూవీలోని చాలా శాతం VFX, గ్రాఫిక్స్ తో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన VFX వర్క్స్ ప్రపంచంలోని టాప్ కంపెనీస్ లో జరుగుతున్నాయని నిర్మాత అశ్వినీ దత్ వెల్లడించాడు. ఈ మూవీ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు.. పోస్టర్ డిజైన్ గ్రాఫిక్స్ విషయంలో కొన్ని విమర్శలు ఎదురయ్యాయి.
అయితే టైటిల్ గ్లింప్స్ వచ్చాక.. మూవీ గ్రాఫిక్స్ పై ఒక నమ్మకం వచ్చింది. కాగా ఈ సినిమా గ్రాఫిక్స్ అండ్ VFX విషయం గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. రీసెంట్ గా హైదరాబాద్ లో ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో సినిమాటిక్ ఎక్స్ పో ప్రోగ్రాం జరిగింది. ఈ ఈవెంట్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. "ప్రభాస్ కల్కి VFX విషయంలో కుదరలేదు. నెక్స్ట్ టైం తప్పకుండా ప్రయత్నిస్తా" అంటూ వ్యాఖ్యానించాడు.
నాగ్ అశ్విన్ కామెంట్స్ ఏంటంటే.. "కల్కి సినిమాని పూర్తి మేడ్ ఇన్ ఇండియా చిత్రంలా తెరకెక్కించాలని అనుకున్నాను. ఆ సినిమాకి సంబంధించిన VFX అంతా ఇండియా కంపెనీస్ తోనే చేయాలని ప్రయత్నించాను. కానీ అది కుదరలేదు. బెస్ట్ క్వాలిటీ కోసం హాలీవుడ్ వెళ్లాల్సి వచ్చింది. కానీ నా నెక్స్ట్ సినిమాని మాత్రం ఇండియా వాళ్ళతోనే తీస్తాను. గత పదేళ్ల నుంచి మన సినిమాల్లో VFX మెరుగవుతూ వస్తుంది. రానున్న రోజుల్లో హాలీవుడ్ కంటే బెస్ట్ క్వాలిటీతో ఇక్కడ సినిమాలు వస్తాయి" అంటూ పేర్కొన్నాడు.
ఇక కల్కి విషయానికి వస్తే.. ఈ మూవీ కథ కలియుగాంతంలో మోడరన్ టెక్నాలజీ మధ్య జరగనుంది. ప్రభాస్ విష్ణుమూర్తి 10వ అవతారం కల్కిగా, మోడరన్ విష్ణుమూర్తిగా కనిపించబోతున్నాడు అంటూ నిర్మాత అశ్వినీ దత్ ఇప్పటికే తెలియజేశాడు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటాని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Next Story