Sun Dec 22 2024 15:25:57 GMT+0000 (Coordinated Universal Time)
ఉగ్రం-సలార్ పోలికపై.. ఇప్పుడా చెప్పేది
సలార్ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి కొంత మంది సినీ అభిమానులు
సలార్ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి కొంత మంది సినీ అభిమానులు ఈ సినిమా కన్నడ బ్లాక్ బస్టర్ 'ఉగ్రం' రీమేక్ అంటూ చెప్పుకొచ్చారు. ఉగ్రం సినిమాను బాగా రిచ్ గా భారీ ఎత్తున తీస్తున్నాడు ప్రశాంత్ నీల్ అంటూ కొందరు సోషల్ మీడియాలో అదే పనిగా ప్రచారం చేశారు. అది కూడా ప్రశాంత్ నీల్ తీసిన సినిమానే!! కానీ కొందరు మాత్రం పనిగట్టుకుని మరీ ఉగ్రం-సలార్ పోలికలు ఇవిగో అంటూ పోస్టులు మీద పోస్టులు పెడుతూ వచ్చారు సోషల్ మీడియాలో! ఇక సినిమా విడుదలకు ఇంకొన్ని గంటలు సమయం మాత్రమే ఉండడంతో ఉగ్రం-సలార్ పోలికపై ప్రశాంత్ నీల్ మాట్లాడారు.
ఉగ్రం సినిమాను ఆడియన్స్ మధ్య థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలనుకున్నాను కానీ ఆ సినిమా నేను అనుకున్నంత హిట్ అవ్వలేదన్నారు ప్రశాంత్ నీల్. ఉగ్రం చాలా స్కోప్ ఉన్న కథ.. అందులో చెప్పలేకపోయిన పాయింట్స్ను సలార్ రూపంలో తీసానన్నారు. అందుకే సలార్ సినిమాలో ఉగ్రం సినిమా పోలికలు కనిపిస్తాయని వివరించారు ప్రశాంత్ నీల్. ప్రభాస్ నటించిన మూవీ సలార్. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తోంది. రెండు పార్టులుగా వస్తున్న ఈ భారీ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. సలార్ సినిమా మొదటి భాగం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Next Story