Mon Dec 23 2024 03:51:14 GMT+0000 (Coordinated Universal Time)
భీమ్లా నాయక్ సినిమాపై ఆర్జీవీ కామెంట్స్.. ఇదొక భూకంపం !
పవన్ కల్యాణ్ కు తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పుకునే ఆర్జీవీ.. భీమ్లా నాయక్ సినిమా పై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా..
తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఓవర్సీస్ లో భీమ్లా నాయక్ మేనియా నడుస్తోంది. ఉదయం నుంచి పడిన షో లతో భీమ్లా నాయక్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. పవర్ ఫుల్ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ.. ఫ్యాన్స్ రివ్యూ ఇచ్చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన భీమ్లా నాయక్.. అభిమానుల ఊహకు ఏమాత్రం తగ్గలేదు. పవన్ పవర్ ఫుల్ యాక్షన్ చూసిన ఫ్యాన్స్ అంతా ఆయన నటనపై ప్రశంసలు కురిస్తున్నారు. తాజాగా ఆర్జీవీ కూడా ఆ జాబితాలోకి చేరిపోయారు.
పవన్ కల్యాణ్ కు తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పుకునే ఆర్జీవీ.. భీమ్లా నాయక్ సినిమా పై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. సినిమా గురించి చేసిన ట్వీట్ లో.. "నేను ముందు నుంచి చెబుతున్నట్లు భీమ్లా నాయక్ సినిమాను హిందీలోనూ విడుదల చేయాలి. ఈ సినిమా హిందీలో ఖచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. భీమ్లా నాయక్ ఒక మెరుపు, పవన్ కళ్యాణ్ సునామి. రానా కూడా పవన్తో పాటీ పడీ నటించారు. మొత్తం మీదం భీమ్లానాయక్ భూకంపాన్ని సృష్టించింది" అని రాసుకొచ్చారు. ఎప్పుడూ నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. ఈసారి పవన్ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించడం ఆయన అభిమానులను, నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
News Summary - Director Ram Gopal Varma Comments About Bheemla Nayak Movie
Next Story