Mon Dec 23 2024 11:53:31 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి పవన్ ను టార్గెట్ చేసిన ఆర్జీవీ.. ఈసారి పాజిటివ్ గానే!
ఇంటీరియర్ ఆంధ్ర లో జరిగిన పుష్ప సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు, కొమరం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జె
టాలీవుడ్ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారు. పవర్ స్టార్ టార్గెట్ గా ఆయన వరుస ట్వీట్లు చేశారు. మీ అభిమానులుగా.. మేము మిమ్మల్ని పాన్ ఇండియా స్టార్ గా చూడాలని కోరుతున్నామని వర్మ ఆ ట్వీట్లలో పేర్కొన్నారు. "ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగు ని పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది.దయచేసి భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి"
Also Read : బాలిక ఆత్మహత్య కేసు.. వినోద్ జైన్ ఇల్లు సీజ్
" ఇంటీరియర్ ఆంధ్ర లో జరిగిన పుష్ప సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు, కొమరం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు, భీమ్లా నాయక్ సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా ? @pawankalyan గారూ ,ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్ని హిందీలో రిలీజ్ చెయ్యొద్దు వర్కవుట్ అవ్వదు, అని ఈ ట్రిట్టర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు.. ఫలితం చూసారు...ఇప్పుడు మళ్లీ చెప్తున్నా .. భీమ్లా నాయక్ ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రిలీజ్ చెయ్యండి..పవర్ ప్రూవ్ చెయ్యండి."
Also Read : పీఆర్సీపై జగన్ అత్యవసర సమావేశం.. ఆ మూడు అంశాలపై?
"పుష్ప యే అంత చేస్తే పవర్ స్టార్ @PawanKalyan అయిన మీరు నటించిన భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి? ..పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేము " అంటూ వర్మ వరుస ట్వీట్లు చేశారు. ఇక ఈ ట్వీట్లపై పవన్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
Next Story