Sat Apr 12 2025 10:59:31 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్జీవీ మరో ట్వీట్...నేను పరారీలో లేను.. ఎక్కడ ఉన్నానంటే?
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో ప్రకటన చేశారు. తాను పరారీలో లేనని ఆయన తెలిపారు.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో ప్రకటన చేశారు. తాను పరారీలో లేనని ఆయన తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేశారు. తన కార్యాలయంలోనే ఉన్నానని, ఎక్కడకూ పరారవ్వలేదన్నారు. తన కోసం మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో వెదుకుతున్న వారికి బ్యాడ్ న్యూస్ అని వర్మ పోస్టు చేశారు.
నోటీసు అందిన వెంటనే...
తనకు నోటీసు అందిన వెంటనే విచారణకు కొంత సమయం కోరానని, అయితే తాను ఆఫీసు నుంచిషూటింగ్ పనుల నిమిత్తం అప్పుడప్పుడూ బయటకు వెళ్లి వస్తున్నాని వర్మ పోస్టు చేశారు. తనను అరెస్ట్ చేయాలని పోలీసులు తన కార్యాలయానికి వస్తే ఎందుకు లోపలికి రాలేదని రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు. తాను ఎక్కడకూ పారిలేదని తెలిపారు.
Next Story