Mon Dec 23 2024 11:29:02 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్ఆర్ఆర్ పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు.. అపార్థం చేసుకోవద్దని రిక్వెస్ట్ !
ఓ సినిమా మాగ్జైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సర్కస్ చూస్తున్నపుడు ఎలాంటి ఉత్సాహం కలుగుతుందో..
తెలుగుతో పాటు పలు ప్రధాన భారతీయ భాషల్లో విడుదలై.. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు చేసి ఘన విజయాన్ని సాధించిన ఆర్ఆర్ఆర్ పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఒక సర్కస్ లా అనిపించిందన్నారు. వంతెన దగ్గర పిల్లాడిని కాపాడే సీన్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా జెమినీ సర్కస్ చేస్తున్న ఫీలింగ్ కలిగిందని చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలను అపార్థం చేస్తుకోవద్దని నెటిజన్లు, ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ను కోరణం గమనార్హం.
ఓ సినిమా మాగ్జైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సర్కస్ చూస్తున్నపుడు ఎలాంటి ఉత్సాహం కలుగుతుందో.. ఈ సినిమా చూస్తున్నపుడు కూడా తనకు అదే ఫీలింగ్ కలిగిందన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా అడిగిన పలు ప్రశ్నలకు వర్మ తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. కాలేజీ రోజుల్లో తనకు కమ్యూనిస్టు భావజాలం ఉండేదని వర్మ తెలిపారు. అయితే అయాన్ ర్యాండ్ పుస్తకాలను చదవడాన్ని ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పటి నుంచి తనలో మార్పు వచ్చిందని చెప్పారు.
తాను తనతో సహా ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోనని అన్నారు. వోడ్కాలోకి పల్లీలను స్టఫ్ గా తీసుకోవడాన్ని ఇష్టపడతానని చెప్పారు. తన కెరీర్ లో కేవలం 'క్షణక్షణం', 'సర్కార్' సినిమాలను మాత్రమే పక్కా స్క్రిప్ట్, దానికి సరిగ్గా సరిపోయే నటులతో తీశానని.. మిగిలిన సినిమాలేవీ కూడా ఫలానా నటుడితో చేయాలనుకుని చేయలేదని తెలిపారు. స్క్రీన్ పై అమ్మాయిలను అందంగా చూపించడంలో తనతో ఎవరూ సరిపోరన్నారు. ఇండస్ట్రీలో మణిరత్నం సినిమాలు తనకు నచ్చవని ఆర్జీవీ స్పష్టం చేశారు.
Next Story