Mon Dec 23 2024 07:09:26 GMT+0000 (Coordinated Universal Time)
మరో యాంకర్ పై ఆర్జీవీ కామెంట్స్.. నా కళ్ల నుంచి ఎలా తప్పించుకున్నావంటూ..
ఇటీవలే బడవ రాస్కెల్ అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఆ ఈవెంట్ కు వచ్చిన రామ్ గోపాల్ వర్మ.. ఈవెంట్ ను హోస్ట్ చేస్తున్న
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సెన్సేషన్ అవ్వాల్సిందే. ఆయన చేసే కామెంట్లు, వ్యాఖ్యలు అలా ఉంటాయి మరి. గతంలో అరియానా గ్లోరీ, అషు రెడ్డిలతో ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో వారిద్దరిపై బోల్డ్ కామెంట్స్ చేసి.. వార్తల్లో నిలిచారు ఆర్జీవీ. తాజాగా మరో యాంకర్ పై షాకింగ్ కామెంట్స్ చేసి, మరోసారి వార్తల్లోకెక్కారు ఈ వివాదాస్పద దర్శకుడు.
Also Read : దండుపాళ్యం సినిమా చూసి దోపిడీ, హత్య
ఇటీవలే బడవ రాస్కెల్ అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఆ ఈవెంట్ కు వచ్చిన రామ్ గోపాల్ వర్మ.. ఈవెంట్ ను హోస్ట్ చేస్తున్న యాంకర్ శ్యామలపై షాకింగ్ కామెంట్స్ చేసి, ఆమె సిగ్గుపడి నవ్వేలా చేశారు. యాంకర్ శ్యామలను తనస్టైల్లో తెగ పొగిడేశాడు. వేదికపైకి వచ్చిన వెంటనే మైక్ పట్టుకున్న ఆర్జీవీ.. తానొక రాస్కెల్ ని అని చెప్పుకున్నారు. ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్లలోంచి ఎలా తప్పించుకున్నారు అంటూ యాంకర్ శ్యామలపై ఓపెన్ కామెంట్స్ చేశాడు. దీంతో ఆశ్చర్యపోయిన శ్యామల తెగ నవ్వుకుంది. అలా ఆర్జీవీ మరో యాంకర్ పై కామెంట్స్ చేసి, వార్తల్లో నిలిచాడు.
Next Story