Mon Dec 23 2024 07:34:21 GMT+0000 (Coordinated Universal Time)
రవితేజ పై "ఖిలాడి" డైరెక్టర్ భార్య సంచలన వ్యాఖ్యలు
తన ఇన్ స్టా స్టోరీస్ లో రవితేజ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దర్శకుడు అజయ్ భూపతి రవితేజను
మాస్ మహారాజా రవితేజ నటించిన ఖిలాడి సినిమా రెండ్రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా కన్నా.. సినిమా హీరోపై డైరెక్టర్ భార్య చేసిన వ్యాఖ్యలే టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. ఖిలాడి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ.. డైరెక్టర్ రమేష్ వర్మపై కాస్త అసహనం ప్రదర్శించారు. సినిమాకు సంబంధించిన అన్ని పనులూ నిర్మాతే దగ్గరుండి చూసుకోవాల్సిందని వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు.. దర్శకుడు మహర్జాతకుడని, సినిమా రిలీజ్కు ముందే నిర్మాతతో కారు కూడా కొనిపించుకున్నాడంటూ సైటిరికల్ కామెంట్స్ చేశాడు రవితేజ. రచయిత శ్రీకాంత్ విస్సా కారణంగానే ఖిలాడి సినిమా చేయడానికి ఒప్పుకున్నా అని డైరెక్ట్గా చెప్పేశాడు కూడా. రవితేజ చేసిన ఈ వ్యాఖ్యలను డైరెక్టర్ రమేష్ వర్మ పెద్దగా పట్టించుకోనట్లే ఉన్నారు కానీ.. వారిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు అనుమానాలు తలెత్తాయి.
Also Read : బొత్స కీలక వ్యాఖ్యలు...మూడు రాజధానులపై?
ఆ అనుమానాలను మరికాస్తా ఆద్యం పోశారు డైరెక్టర్ రమేష్ వర్మ భార్య రేఖా వర్మ. తన ఇన్ స్టా స్టోరీస్ లో రవితేజ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దర్శకుడు అజయ్ భూపతి రవితేజను చీప్ స్టార్ అని ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమైందని రాసుకొచ్చారు. డైరెక్టర్ కూ ఒక స్టైల్ ఉంటుందని, అది హీరోకి చెప్పి చేయిస్తేనే కెమెరాల్లో యంగ్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తారని.. ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ కే దక్కుతుందని రేఖా వర్మ పోస్ట్ లో పేర్కొంది. ఇప్పుడు ఈ కామెంట్సే వాళ్లకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. రవితేజ అభిమానులు.. రేఖవర్మపై కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు. మీరు ఇలాంటి వాళ్లు కాబట్టే.. రవితేజ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అలా మాట్లాడారని కామెంట్స్ చేస్తున్నారు. ఈ హీరో - డైరెక్టర్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇంకెంతదూరం వెళ్తుందో.. దీనికి ఫుల్ స్టాప్ పడేదెప్పుడో వారికే తెలియాలి.
Next Story