Mon Dec 23 2024 07:43:47 GMT+0000 (Coordinated Universal Time)
ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఆర్టిస్ట్.. విరాళాలివ్వండంటూ రాజమౌళి పోస్ట్!
"బాహుబలి సినిమా కోసం దేవికతో కలసి పనిచేశాను. ఎన్నో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఆమె కోర్డినేటర్ గా పనిచేశారు. ఆమె
తన సహ కళాకారిణి ప్రాణాంతక వ్యాధితో పోరాడుతుండటం జక్కన్న మనసును కలచివేసింది. అందుకే ట్విట్టర్ వేదికగా ఆ ఆర్టిస్ట్ వైద్యానికి విరాళాలు ఇవ్వండి అంటూ పోస్ట్ పెట్టారు. "బాహుబలి సినిమా కోసం దేవికతో కలసి పనిచేశాను. ఎన్నో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఆమె కోర్డినేటర్ గా పనిచేశారు. ఆమె అభిరుచి, అంకిత భావం నిజంగా సాటిలేనివి. కానీ, దురదృష్టవశాత్తూ బ్లడ్ కేన్సర్ తో పోరాటం చేస్తున్నారు. నేను ఇక్కడ షేర్ చేస్తున్న కెట్టో ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి మీ వంతుగా సాయం చేయాలని సవినయంగా కోరుతున్నాను" అని రాజమౌళి పోస్ట్ పెట్టారు.
అయితే ఆ పోస్ట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు కొందరు నెటిజన్లు కామెంట్స్ చేయగా.. మరికొందరు మాత్రం మీరెందుకు సహాయం చేయకూడదు అని రాజమౌళిని ప్రశ్నించారు. మీరు రూ.800 కోట్లు సంపాదించారుగా.. సహాయం చేస్తే తప్పేంటి అని మరికొందరు.. మీరు తప్పకుండా ఆమె వైద్యానికి కావాల్సినంత సమకూరుస్తారని ఆశిస్తున్నాం అంటూ ఇంకొందరు కామెంట్స్ చేశారు. రాజమౌళి చేసిన ఈ పోస్ట్ పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు రావడం ఆశ్చర్యానికి కలుగచేస్తోంది.
Next Story