Sun Dec 29 2024 03:54:13 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం
కృష్ణా జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన రామారావు ‘నవరాత్రి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పరిచయమయ్యారు. తాతినేని 70కిపైగా
హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ దర్శకుడు తాతినేని రామారావు కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యం బాధపడుతున్న ఆయన చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ 'యమగోల' సినిమాకు తాతినేని దర్శకత్వం వహించారు.
ఆయన వయసు 84 సంవత్సరాలు. కృష్ణా జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన రామారావు 'నవరాత్రి' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పరిచయమయ్యారు. తాతినేని 70కిపైగా తెలుగు, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో యమగోల, జీవనతరంగాలు, దొరబాబు, ఆలుమగలు, అనురాగదేవత, న్యాయానికి సంకెళ్లు వంటి సూపర్ హిట్ చిత్రాలు కూడా ఉన్నాయి. రాజేంద్రప్రసాద్‌తో గోల్మాల్ గోవిందం, సూపర్‌స్టార్ కృష్ణతో అగ్నికెరటాలు వంటి సినిమాలను తెరకెక్కించారు.
తెలుగులో నవరాత్రి, బ్రహ్మచారి, సుపుత్రుడు, రైతు కుటుంబం, దొరబాబు, ఆలుమగలు, శ్రీరామరక్ష, యమగోల, ఆటగాడు, అనురాగ దేవత, జీవనతరంగాలు, ఇల్లాలు, తల్లదండ్రులు, ప్రెసిడెంట్‌గారి అబ్బాయి వంటి విజయవంతమైన సినిమాలు ఆయన దర్శకత్వంలో తెరకెక్కినవే. వీటితోపాటు హిందీలో లోక్-పరలోక్, అంధా కానూన్, ఇంక్విలాబ్, బేటీ నవంబర్ వన్ వంటి సినిమాలను రూపొందించారు. తాతినేని మృతికి టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Next Story