Mon Dec 23 2024 19:41:55 GMT+0000 (Coordinated Universal Time)
దగ్గుబాటి అభిరామ్ "అహింస" ట్రైలర్
ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతు..
చిత్రం, జయం, నిజం, నువ్వు నేను, నేనేరాజు నేనేమంత్రి, సీత వంటి సినిమాలను తీసిన.. దర్శకుడు తేజ తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా "అహింస". ఈ సినిమాతో ప్రొడ్యూసర్ సురేష్ చిన్న కొడుకు దగ్గుబాటి అభిరామ్ టాలీవుడ్ కి హీరోగా పరిచయమవుతున్నాడు. అహింస నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్ మంచి వైబ్స్ క్రియేట్ చేశాయి. అభిరామ్ ను మంచి లుక్ లో చూసిన దగ్గుబాటి అభిమానులు.. సినిమా ఎలా ఉండబోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతులు మీదుగా ట్రైలర్ విడుదలైంది. ఇప్పటివరకూ లవ్ స్టోరీలతో హిట్ కొట్టిన తేజ మరోసారి.. అదే కంటెంట్ తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సదా-ఆర్పీ పట్నాయక్ - తేజ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఘన విజయాలు సాధించినట్లే.. "అహింస" కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నారు అభిమానులు.
ట్రైలర్ విషయానికొస్తే.. పేదవాడైన హీరోకు ఆర్థిక పరమైన కష్టాలు ఎదురైనట్లుగా తెలుస్తోంది. విలన్ నుండి వచ్చిన సమస్యలను అతనెలా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో అతనికి ఎవరు సాయం చేస్తారు అనే అంశాలతో ఈ సినిమా కథ ఉండబోతుంది. ఈ సినిమాలో గీతిక హీరోయిన్గా నటిస్తోండగా, సదా లాయర్ పాత్రలో కనిపించనుంది. రజత్ బేడి, రవి కాలే, కమల్ కామరాజు తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే అహింస సినిమా.. థియేటర్లలో విడుదల కాబోతోంది.
Next Story