Mon Dec 23 2024 17:17:51 GMT+0000 (Coordinated Universal Time)
ఆ సీరియల్ స్టార్ ఒకప్పటి వీడియో వైరల్.. షాకవుతున్నారు..!
కామెడీతో కూడిన ఈ ధారావాహికలో నటించే పలువురు నటులు మంచి సక్సెస్
'తారక్ మెహతా కా ఉల్టా చష్మా'.. హిందీలో సుదీర్ఘంగా ప్రసారమవుతున్న సీరియల్ ఇది. కామెడీతో కూడిన ఈ ధారావాహికలో నటించే పలువురు నటులు మంచి సక్సెస్ ను ఈ షోతో సాధించారు. నటి దిశా వకాని 'దయాబెన్' పేరుతో బాగా ఫాలోయింగ్ సంపాదించారు. ఆమె ప్రస్తుతం షోలో కనిపించడం లేదు. ఈ షో అభిమానులు ఆమె పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. దిశా వకాని ఐటెమ్ సాంగ్.. ఇందులో ఆమె డ్యాన్స్ చేస్తూ కనిపించింది. దిశా వకానీ సీరియల్ లో ఎంతో పద్దతిగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఒకప్పటి వీడియోలో ఇంత హాట్ గా కనిపించడంతో అందరూ షాక్ అవుతూ ఉన్నారు.
తారక్ మెహతా కా ఉల్టా చష్మా అభిమానులను దిశా వకాని షాక్ కు గురి చేసింది. ప్రేక్షకులు ఆమెను ఎప్పుడూ చీర, సాంప్రదాయ అలంకరణలో చూస్తూ ఉంటారు. కానీ ఇలా ఆమెను చూడగానే అందరూ షాక్ అవుతూ ఉన్నారు. దిశా మోడలింగ్ డేస్ సమయంలో ఈ వీడియోను రూపొందించినట్లు తెలుస్తోంది. భింగ్రీ గ భింగ్రీ పాట ట్యూన్లకు డ్యాన్స్ చేసి దిశా వకాని వైరల్గా మారింది.
Next Story