Mon Dec 23 2024 14:19:21 GMT+0000 (Coordinated Universal Time)
నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంట్.. బిగ్ బాస్ ఓటీటీ ప్రోమో వచ్చేసింది !
ఇప్పటివరకూ తెలుగులో వచ్చిన 4 సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులను ఊహించిన స్థాయిలో
బిగ్ బాస్.. ఈ షో కి బుల్లితెరపై ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, హిందీ, తమిళ్ ఇలా అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ ను ఆదరించేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. గతేడాది డిసెంబర్ లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ముగిసిన సంగతి తెలిసిందే. ఇటీవలే హిందీ బిగ్ బాస్ 15వ సీజన్ ఘనంగా ముగిసింది. ఇప్పటివరకూ తెలుగులో వచ్చిన 4 సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులను ఊహించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. శృతి మించిన ప్రవర్తనలు, హద్దు దాటిన వెకిలి చేష్టలు సగటు ప్రేక్షకుడిని విసుగెత్తించాయి. దాంతో సీజన్ 5 టీఆర్పీ రేటింగ్ భారీగా పడిపోయింది.
ఇక 6వ సీజన్ ను 24 గంటలు లైవ్ ఇచ్చేలా.. ఓటీటీలో టెలికాస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు గతంలోనే ప్రకటన కూడా చేశారు. తాజాగా బిగ్ బాస్ ఓటీటీ అఫీషియల్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. త్వరలోనే బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం కానుందని, నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంట్ పొందేందుకు సిద్ధంగా ఉండాలని మేకర్స్ ప్రకటించారు. బిగ్బాస్ ఓటీటీలో పాల్గోనబోయే కంటెస్టెంట్స్ ఎవరు.. ఎప్పటినుంచి ఈ షో ప్రారంభం కాబోతుందంటూ సోషల్ మీడియాలో రోజూకో వార్త చక్కర్లు కొడుతుంది. ఈ సీజన్ లో పాత కంటెస్టెంట్లతో పాటు.. పలువురు కొత్త కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది.
News Summary - Disney plus Hotstar Releases Bigg Boss 6 OTT Promo and Logo
Next Story