Mon Nov 25 2024 03:46:41 GMT+0000 (Coordinated Universal Time)
భర్తతో విడాకులు.. రెండో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్
భర్తతో విడాకులు తీసుకుంది. ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమైంది టాలీవుడ్ హీరోయిన్
భర్తతో విడాకులు తీసుకుంది. ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమైంది ఆ హీరోయిన్. ఇంతకీ ఎవరామె అనుకుంటున్నారా ? 7/జి బృందావన కాలనీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు అనితగా పరిచయమైన సోనియా అగర్వాల్. తెలుగులో హీరోయిన్ గా చేసింది ఆ ఒక్క సినిమానే అయినప్పటికీ.. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఆమెను గుర్తిస్తున్నారు. 2006లో ఈ భామ తమిళ డైరెక్టర్ సెల్వ రాఘవన్ ని ప్రేమించి పెళ్లాడింది. ఆ తర్వాత కాపురంలో తలెత్తిన విభేదాల కారణంగా అతనితో విడాకులు తీసుకుని, ఒంటిరిగా ఉంటోంది.
సెకండ్ ఇన్నింగ్స్ లో....
పెళ్లి అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ లో టెంపర్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించి, మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించినా.. పెద్దగా గుర్తింపు సంపాదించలేకపోయింది సోనియా. తాజాగా ఈ అమ్మడు రెండో పెళ్లికి సిద్ధమైనట్లు కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. కొద్ది రోజులుగా సోనియా అగర్వాల్ మరో తమిళ డైరెక్టర్ ప్రేమలో ఉందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి కానీ.. సోనియా కొట్టిపారేసింది. మరి ఇప్పుడు వస్తున్న వార్తలు నిజమో కాదో సోనియా స్పందిస్తే గానీ తెలియదు
Next Story