Mon Dec 23 2024 09:16:46 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలో డీజే టిల్లు.. ఎప్పట్నుంచో మీరే చూడండి !
డీజే టిల్లు సినిమా సక్సెస్ అవ్వడంతో.. దీనికి సీక్వెల్ ను రూపొందించే ప్లాన్ లో ఉన్నారు నిర్మాతలు. కాగా.. ప్రముఖ తెలుగు ఓటీటీ..
హైదరాబాద్ : థియేటర్లలో విడుదలైన చిన్న సినిమాలన్నీ.. నెలరోజుల్లోపే ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఇటీవలే వచ్చిన డీజే టిల్లు సినిమా కూడా ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. సిద్ధు జొన్నలగడ్డ - నేహా శెట్టి జంటగా వచ్చిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది. సిద్ధు ఇండస్ట్రీలోకి వచ్చి 12 ఏళ్లవుతుండగా.. డీజే టిల్లు సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. విమల్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. పూర్తి తెలంగాణ స్లాంగ్ లో ఉండే ఈ సినిమా.. తెలుగు రాష్ట్రాల్లో విశేష ప్రేక్షకాదరణ పొందింది.
డీజే టిల్లు సినిమా సక్సెస్ అవ్వడంతో.. దీనికి సీక్వెల్ ను రూపొందించే ప్లాన్ లో ఉన్నారు నిర్మాతలు. కాగా.. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో డీజే టిల్లు స్ట్రీమ్ అవ్వనుంది. ఈ విషయాన్ని ఆహా సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ.. స్పెషల్ పోస్టర్ ను వదిలింది. 'ఇగ టిల్లుగాడి లొల్లి ఆహాలో.. అతి త్వరలో' అంటూ అభిమానులను ఊరించింది. మార్చి 10 నుంచి డీజే టిల్లు సినిమా ఆహాలో ప్రసారం కానుందంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. దానిని బట్టి మార్చి 10నే సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవ్వొచ్చని భావిస్తున్నారు సినీ అభిమానులు. మరి ఈ సినిమాను ఎప్పట్నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేస్తారో.. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Next Story