Wed Dec 25 2024 16:55:52 GMT+0000 (Coordinated Universal Time)
Drums Shivamani: ఎస్పీబీ పంపిన ఆఖరి వాయిస్ నోట్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్న శివమణి
ఆహాలో ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-3 లో
ఆహాలో ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-3 లో సంగీతంతో ఉర్రూతలూగించే కంటెస్టెంట్స్ మాత్రమే కాకుండా.. పలువురు ప్రముఖ సెలబ్రిటీలు కూడా వస్తుంటారు. ఆనందన్ శివమణి.. అదేనండి డ్రమ్స్ తో యావత్ ప్రపంచాన్ని కట్టి పడేసే డ్రమ్స్ శివమణి చీఫ్ గెస్ట్ గా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-3లో ఈ వారం హాజరయ్యారు. లెజండరీ సింగర్, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. తన సంగీత ప్రయాణంలో బాలసుబ్రహ్మణ్యం ప్రభావం ఎంతో ఉందని తెలిపారు. SP బాలసుబ్రహ్మణ్యం మార్గదర్శకత్వంలో తన వృత్తిని ప్రారంభించానని.. అలాంటి ఆయన అకాల మరణం చెందడాన్ని తాను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని కన్నీటి పర్యంతమయ్యారు.
భావోద్వేగభరిత ఎపిసోడ్ లో, SP బాలసుబ్రహ్మణ్యం తనకు పంపిన చివరి వాయిస్ నోట్‌ను శివమణి పంచుకున్నారు. దాన్ని ఆయన ప్లే చేశారు. తమ బంధం ఎలాంటిదో శివమణి తెలిపారు. జూలై 21, 2024న జరిగిన గురు పూర్ణిమ రోజున తాను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను స్మరించుకున్నానని కూడా శివమణి పంచుకున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ 3 జడ్జి S.థమన్ కూడా SP బాలసుబ్రహ్మణ్యంతో తనకున్న బంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయనతో కలిసి 12 ఏళ్ల వయస్సులో మొదటిసారి విమాన ప్రయాణం చేశానని గుర్తుచేసుకున్నారు. తన తండ్రి మరణంతో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని.. ఆ సమయాల్లో శివమణి నుండి తనకు లభించిన మద్దతును కూడా థమన్ హైలైట్ చేశారు.
Next Story