Mon Dec 23 2024 03:10:20 GMT+0000 (Coordinated Universal Time)
Balakrishna : బాలకృష్ణ సినిమాలో దుల్కర్ నటించబోతున్నారా..?
బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న సినిమాలో దుల్కర్ నటించబోతున్నారా..?
Balakrishna : బాలకృష్ణ వరుస విజయాలతో ఫుల్ స్పీడ్ లో ముందుకు దూసుకు పోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్టు అందుకున్న బాలయ్య.. అదే జోష్తో రీసెంట్ గా తన 109వ చిత్రాన్ని కూడా పట్టాలికించేశారు. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య కలిసి నిర్మించబోతున్నారు. యాక్షన్ షెడ్యూల్ తో మొదలైన ఈ మూవీ షూటింగ్ ఊటీలో జరుగుతున్నట్లు సమాచారం.
ఇది ఇలా ఉంటే, ఈ మూవీ గురించి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా నటించబోతున్నారంటూ ఫిలిం వర్గాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ఒక బలమైన కీలక పాత్ర ఉందట. ఆ పాత్రని దుల్కర్ తో చేయించడానికి దర్శకుడు బాబీ నిర్ణయం తీసుకున్నారట. దుల్కర్ సల్మాన్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం దుల్కర్ సల్మాన్, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ‘లక్కీ భాస్కర్’ అనే మూవీ చేస్తున్నారు. ఇక బాబీ గత సినిమా 'వాల్తేరు వీరయ్య'లో చిరంజీవితో పాటు రవితేజ పాత్రని కూడా చూపించి ఆడియన్స్ ని అలరించారు. ఈ రెండు విషయాలను చూపిస్తూ.. దుల్కర్, బాలయ్య సినిమాలో చేయడం పక్కా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే చిత్ర నిర్మాతల నుంచి ఒక క్లారిటీ రావాల్సిందే.
ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు వివరాలు గురించి తెలియాల్సి ఉంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ చిత్ర షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ భారీలో నిలిపేందుకు మేకర్స్ సిద్దమవుతున్నట్లు సమాచారం. సమ్మర్ లో ఎన్టీఆర్ 'దేవర' కూడా రిలీజ్ ఉంది. దీంతో ఈసారి బాబాయ్-అబ్బాయి మధ్య పోటీ ఉండబోతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
Next Story