Sun Dec 22 2024 22:11:05 GMT+0000 (Coordinated Universal Time)
NBK109 : బాలయ్య మూవీలో దుల్కర్.. హింట్ ఇచ్చిన హీరోయిన్..
బాలయ్య NBK109 మూవీలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నట్లు టాలీవుడ్ హీరోయిన్ హింట్ ఇచ్చారు.
NBK109 : నందమూరి బాలకృష్ణ తన 109వ చిత్రాన్ని దర్శకుడు బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆల్రెడీ చిత్రీకరణ మొదలుపెట్టుకొని ఓ షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. ఊటీలో బాలయ్యతో హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఏపీ ఎన్నికల కారణంతో షూటింగ్ కి కొంచెం విరామం వచ్చింది. అయితే షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ మూవీలో నటిస్తున్నారు అనేది మాత్రం సమాచారం లేదు.
తాజాగా ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నట్లు టాలీవుడ్ హీరోయిన్ చాందిని చౌదరి హింట్ ఇచ్చారు. 'గామి' మూవీ ప్రమోషన్స్ లో ఉన్న చాందిని.. ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను NBK109 మూవీలో నటిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆ మూవీలో దుల్కర్ సల్మాన్ ఉండొచ్చు అని చెబుతూ హింట్ ఇచ్చారు.
ఇక వార్తతో NBK109 మూవీ పై మరింత క్రేజ్ క్రియేట్ అయ్యింది. మాస్ గాడ్ బాలయ్య, లవర్ బాయ్ దుల్కర్ కాంబినేషన్ అంటే ఆడియన్స్ లో మంచి ఆసక్తిని కలగజేస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ ఎలా ఉంటాయో అని క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమాలో రవితేజని కూడా పవర్ ఫుల్ పాత్రలో చూపించి.. రవితేజ ఫ్యాన్స్ ని కూడా ఫుల్ ఖుషి చేశారు దర్శకుడు బాబీ. ఇప్పుడు ఈ సినిమాతో అదే మ్యాజిక్ ని క్రియేట్ చేస్తారేమో చూడాలి.
Next Story