Mon Dec 23 2024 15:24:26 GMT+0000 (Coordinated Universal Time)
శేఖర్ కమ్ములతో దుల్కర్ సినిమా.. మరో ప్రేమకథాచిత్రమ్ ?
ఇటీవలే శేఖర్ కమ్ముల కథను వినిపించగా.. దుల్కర్ దానిని ఓకే చేసినట్లు తెలుస్తోంది. లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమ్ముల..
మళయాళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న దుల్కర్ సల్మాన్.. ఇటీవలే సీతారామంతో బిగ్ హిట్ అందుకున్నారు. మహానటి నుంచి తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందేందుకు దుల్కర్ ప్రయత్నిస్తున్నారు. అందుకే డబ్బింగ్ సినిమాలు కాకుండా పక్కా తెలుగు సినిమాలు చేస్తున్నారు. సీతారామం భారీ విజయం అందుకోవడంతో ఇకపై మళయాళంతో పాటు తెలుగు సినిమాలను చేస్తానని చెప్పాడు. ఈ క్రమంలో మరో తెలుగు సినిమాను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈసారి ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ములతో దుల్కర్ సినిమా చేయనున్నట్లు సమాచారం.
ఇటీవలే శేఖర్ కమ్ముల కథను వినిపించగా.. దుల్కర్ దానిని ఓకే చేసినట్లు తెలుస్తోంది. లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమ్ముల నుంచి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం ధనుష్ హీరోగా ఒక సినిమా చేయనున్నాడన్న టాక్ మాత్రం బయటికి వచ్చింది. ప్రస్తుతం ధనుష్ తెలుగులో సార్ సినిమా చేస్తుండగా.. వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ సార్ ను విడుదల చేయనున్నారు. ధనుష్ తో సినిమాకు ఇంకా సమయం ఉండగా.. శేఖర్ కమ్ముల ఇంతలో దుల్కర్ తో సినిమా మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఒక ప్రకటన చేయనున్నారు.
Next Story