Mon Dec 23 2024 02:19:46 GMT+0000 (Coordinated Universal Time)
ఎట్టకేలకు ఆ లిస్టులోకి చేరిన షారుఖ్ ఖాన్ సినిమా
షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ సినిమా ఎట్టకేలకు గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద 400 కోట్ల క్లబ్లో
షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ సినిమా ఎట్టకేలకు గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద 400 కోట్ల క్లబ్లో చేరింది. ఈ రికార్డును సాధించిన షారుఖ్ ఖాన్ 4వ చిత్రంగా ఇది నిలిచింది. డిసెంబర్ 21న విడుదలైన డంకీ సినిమా, SRK, రాజ్‌కుమార్ హిరానీల కాంబో అంచనాలను అందుకోవడంలో విఫలమైనప్పటికీ, కామెడీ డ్రామా మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ ఉంది. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద షారూఖ్ ఖాన్ డంకీ సినిమా 400 కోట్ల మార్కును దాటింది. ఈ సినిమా ఇండియా నెట్ 197 కోట్ల కలెక్షన్స్ రాగా.. గ్రాస్ 238 కోట్లు వచ్చింది. ఓవర్సీస్ గ్రాస్ సుమారుగా 19.75 మిలియన్లకు చేరుకుంది. దీంతో మొత్తం కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు చేరుకుంది. చెన్నై ఎక్స్‌ప్రెస్, పఠాన్, జవాన్ తర్వాత 400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన షారుక్ ఖాన్ నాలుగవ సినిమా.
చెన్నై ఎక్స్‌ప్రెస్ [420Cr] సినిమా జీవితకాల గ్రాస్‌ను డంకీ సినిమా బ్రేక్ చేసింది. దీంతో షారుఖ్ ఖాన్ కెరీర్ లో 3వ అతిపెద్ద గ్రాసర్‌గా నిలిచింది. ఇక మిగిలిన అన్ని టాప్ 3 బిగ్గెస్ట్ గ్రాసర్స్ 2023లో వచ్చాయి. ఈ సినిమాలో విక్కీ కౌశల్, తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ వంటి నటులు కూడా ఉన్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించగా, ప్రీతమ్ సంగీతాన్ని సమకూర్చారు. షారుఖ్ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ తొలిసారిగా ఈ సినిమాలో కలిసి పని చేశారు.
Next Story