దిల్ రాజు వల్ల కాలేదా
సంక్రాంతి సీజన్ లో రెండు రోజుల గ్యాప్ లో ఒకొక్క సినిమా రిలీజ్ అయితేనే అవి వసూళ్ల పై ఎఫెక్ట్ పడుతుంది. అటువంటిది ఒకేరోజు ఇద్దరు స్టార్ [more]
సంక్రాంతి సీజన్ లో రెండు రోజుల గ్యాప్ లో ఒకొక్క సినిమా రిలీజ్ అయితేనే అవి వసూళ్ల పై ఎఫెక్ట్ పడుతుంది. అటువంటిది ఒకేరోజు ఇద్దరు స్టార్ [more]
సంక్రాంతి సీజన్ లో రెండు రోజుల గ్యాప్ లో ఒకొక్క సినిమా రిలీజ్ అయితేనే అవి వసూళ్ల పై ఎఫెక్ట్ పడుతుంది. అటువంటిది ఒకేరోజు ఇద్దరు స్టార్ హీరోస్ సినిమాలు రిలీజ్ అయితే వచ్చే లాభం తక్కువ, కలిగే నష్టం ఎక్కువ. ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఇటువంటి వాతావరణం ఇండస్ట్రీ కి మంచిది కాదు. మరి ఇటువంటి టైములో ఒకే రోజు అంటే జనవరి 12న మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో రిలీజ్ అవుతున్నాయి. నిర్మాతలు, హీరోల మధ్య ఏం జరిగిందో ఖచ్చితంగా తెలీడంలేదు కానీ పంతం మీద రెండు సినిమాలు ఒకే రోజున దిగుతున్నాయని మాత్రం అర్థమవుతోంది.
కాంప్రమైజ్ కుదురుతుందా….
అల్లు అరవింద్, దిల్ రాజు మంచి సన్నిహితులు అని అందరికి తెలిసిన విషయమే. వీరు అసలు ఇటువంటి పోటీ ని స్వాగతించరు. వీలైనంత కాంప్రమైజ్ చేసుకుని చెరొక డేట్ లో రిలీజ్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. పైగా ‘సరిలేరు నీకెవ్వరు’ నిర్మాణంలో భాగస్వామి అయిన దిల్ రాజు గీతా ఆర్ట్స్, హారికా హాసిని సంస్థలకు కీలక బయ్యర్. వీరి సినిమాలు దిల్ రాజు కొని నైజాం లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. పైగా ‘అల వైకుంఠపురములో’ చిత్ర నైజాం హక్కుల్ని దక్కించుకున్నారట దిల్ రాజు. అంటే ఇప్పుడు దిల్ రాజువి రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. మరి ఆయన రెండూ క్లాష్ అవుతున్నా ఎలా ఊరుకున్నారు, కాంప్రమైజ్ చేయలేదా అనేది ఎవరికి అర్ధం కావడంలేదు. మరి రానున్న రోజుల్లో ఏమన్నా కాంప్రమైజ్ అవుతున్నారేమో చూద్దాం.