అవునా.. నిజమా..?
పెళ్లి చూపులు తర్వాత చాలా గ్యాప్ తీసుకుని సరేష్ ప్రొడక్షన్స్ లో ఈ నగరానికి ఏమైంది అనే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ని డైరెక్ట్ చేసాడు. అందరూ కొత్త మొహాలతో.. ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీలింగ్ తెప్పించడానికి తరుణ్ భాస్కర్ అన్ని విధాలుగా ప్రయత్నించాడనే విషయం ఈ నగరానికి ఏమైంది ట్రైలర్ లో చూపించాడు. యూత్ ని టార్గెట్ చేస్తూ చేసిన ఈ సినిమా వచ్చే శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ట్రేడ్ లో పెద్దగా బజ్ లేకపోడంతో.. ఈ సినిమా నిర్మాత సురేష్ బాబు తనదగ్గరున్న స్ట్రాటజీ మొత్తాన్ని ఉపయోగిస్తున్నట్టుగా అనిపిస్తుంది. సినిమా విడుదలకు పది రోజుల ముందునుండే ఈ సినిమాపై హైప్ క్రియేట్ చెయ్యాలని.. ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ చేస్తున్నాడు.
అంతేకాదు ఈ నగరానికి ఏమైంది ప్రీమియర్స్ ద్వారా మరింత బజ్ పెంచాలనే ప్లాన్ లో ఉన్నారు. అయితే ఈ సినిమా విడుదలకు దగ్గరపడుతున్న వేళ ఈ సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ విషయమొకటి బయటికి వచ్చింది. అదేమిటంటే తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది సినిమాని.. 2009లో వచ్చిన హాలీవుడ్ మూవీ హ్యాంగ్ ఓవర్ స్ఫూర్తిగా తెరకెక్కించినట్టుగా ఫిలింనగర్ టాక్. ఇంతకీ ఆ హాలీవుడ్ మూవీ కథాకమామీషు ఏమిటంటే.... ఒక స్నేహితుడి పెళ్లి కుదిరిన సందర్బంగా నలుగురు స్నేహితులు కలిసి లాంగ్ డ్రైవ్ కు వెళ్తారు. రాత్రి బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఉదయం లేవగానే ఏం జరిగిందో అంతా మర్చిపోయి ఉంటారు. అదే వాళ్ళను ప్రమాదంలోకి నెడుతుంది. ఊహించని పరిణామాలు జరుగుతాయి. తర్వాత ఉండే ట్విస్ట్ లు సినిమాకే హైలెట్. మరి ఇదే కథ స్పూర్తితో.. ఈ నగరానికి ఏమైంది సినిమా ఉండబోతుందంటూ వార్తలొస్తున్నాయి.
మరి ఈ నగరానికి ఏమైంది ట్రైలర్ ని డీప్ గా వీక్షిస్తే... నిజంగానే తరుణ్ భాస్కర్ హాలీవుడ్ మూవీ హ్యాంగ్ ఓవర్ సినిమా కథని స్ఫూర్తిగా తీసుకున్నాడని అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సినిమాలోనూ ఫిలిం మేకర్స్ కావాలని పబ్బులు, స్మోకింగ్ చేస్తూ ఉండడం ఇవన్నీ అదే అనుమానాన్ని రేకెత్తిస్తున్నాయి. మరి ఏ సినిమా స్ఫూర్తి అయినా... పెళ్లి చూపులు తో డీసెంట్ ప్రేమ కథను తెరకెక్కించిన తరుణ్ ఈసారి ఈ సినిమాతో ఎలాంటి హిట్ కొడతాడా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోతుంది